అక్కడక్కడ చేరిన నల్లని మబ్బులతో
ఆకాశానికి మాసికలేసినట్లైనట్లు
అతుకులబొంతలా మారింది అతని బతుకు...*
అవును..
అతను ఇంటి ముందరున్న మొండిగోడపై కూర్చోని..
ఆ దారిగుండా..
వచ్చి పోయే వారికి మాటల టానిక్ ను అందించడంతో..
మనసున దాగిన మొండి రుగ్మతలెన్నో మటుమాయమయ్యేవి...
*కానీ..*
ఆమే మాత్రం
మాటలతో హింసించి
లేని రోగాలను సైతం
వరమందించే మహత్తర గుణ సంపగి...
ఏమాటకామాటే చెప్పుకోవాలీ..
అందుకే అంటున్నా..
ఆ ఇంట నిత్యపోరు నీరింకని వాగై ..
పరిసరమంతా పరుసుకునేది..
*ఏమైందో ఏమో కానీ..*
ఒక ఉదయం
అతని మాటనెత్తుకుపోయింది కాలం దొంగలా..
ఆవరించిన నిశ్శబ్దం చేసింది జీవితాన్ని అతలాకుతలం..
*అందుకే ఇప్పుడామే..*
మానసిక బలానికి
మంచి మాటలటానిక్ తో పాటుగా..
శారీరక బలానికి
సిరప్ ను కూడా అందిస్తోంది స్పూన్ తో అతనికి ప్రేమగా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి