కురవవర్షము జోరుతోడను
కుంటలన్నియు నిండెనే
వరదపారగ పల్లెలప్పుడు
పారవశ్యము నొందెనే
చెరువునిండగ బెస్తవారలు
చేపలెన్నియొ పట్టెనే
బరువుతూచినెయమ్ముకొందురు
భారి చేపలనన్నియున్
ధరణిలోపల సొమ్మువచ్చిన
తక్కువవ్వును బాధలున్
2 *మత్తకోకిల*
కృష్ణు డచ్చట వేణుగాణము
కేకి ముందర జేయగన్
తృష్ణ తోడుత పింఛమిప్పుచు
తీరనాట్యము జేసెనే
కృష్ణజింకట వచ్చెనొక్కటి
గెంతులేయుచు చక్కగన్
కృష్ణలీలలు చూడభాగ్యమ
క్షీరసాగర మందునన్
విష్ణు రూపుడు కృష్ణుడవ్వగ
వెన్న దొంగగ మారెనే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి