"చెట్ల గొప్పదనం"(మినీ కవిత):-స్నేహితారెడ్డి k, 7వ తరగతి-హైదరాబాద్9949041802


అందరు మొక్కలు నాటాలి
చక్కగ నీళ్ళూ పోయాలి
రోజూ ప్రేమగ చూడాలి
చెట్లతో స్నేహం చేయాలి

సువాసన పూలనిస్తాయి
కమ్మని పండ్లనిస్తాయి
ప్రాణవాయువును ఇస్తాయి
ఆరోగ్యాన్ని ఇస్తాయి

సకల సంపదలను ఇస్తాయి
కాలుష్యాన్ని తగ్గిస్తాయి
ఓషధాలను ఇస్తాయి
ఆనందాన్ని ఇస్తాయి