వచన పద్యాలు : -: చెన్నా సాయిరమణి-MA తెలుగు
1)భవ్య బంధుర భారతి భూషణ
భాగ్య బిందు బృంద భవిత 
బీజాక్ష భాషణ భువనాధిక భారత భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

2)ఇంపు ఒంపుల సొంపు చంపుల 
కెంపు వంపుల తలంపు మందింపుల 
కావ్యంపు కవ్వింపుల కవనంపు వినసొంపు భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

3)పరమ పావనంబు పద్యంబులు 
గాత్ర వాయిద్యంబు గద్యంబులు 
వేద పఠన సమానంబు వచనము భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

4)విశాల విఖ్యాత విజయ విజ్ఞాన 
వీనుల విందుల విక్రమ వినూత్న 
విద్య వాసికి  వినయ విశ్వ భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

5)చిద్విలాస చిత్ర చిత్తంపు చిన్మయ 
చారు చంచల చతుర చక్కని 
చంపు చిక్కని చిగురుల చిరంజీవ భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !