దేశభక్తి కైతికాల పుస్తకం ఆవిష్కరణ 14 న


 ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఆగష్టు 14 శనివారం రోజున కవి, రచయిత, ముత్యాల హారం రూపకర్త, శ్రీ రాథోడ్. శ్రావణ్, రచించిన "దేశభక్తి కైతికాలు" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం  తిరుమల ఫంక్షన్ హాల్ ఉట్నూర్ లో ఉంటుందని ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షుడు  శ్రీ ,కొండగుర్ల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకం జిల్లా పరిషత్ చైర్మన్ ఆదిలాబాద్  గౌరవ, శ్రీ, రాథోడ్. జనార్ధన్ గారు, ఆసిఫాబాద్ శాసన సభ్యులు, శ్రీ .ఆత్రం సక్కు గారు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి, కుమ్ర. ఈశ్వరిబాయి గారు, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రముఖ కవి శ్రీ గోపగాని రవీందర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కానుందని వారు అన్నారు.స్వాతంత్య సంగ్రామంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి,తాంతియ్యతోపే, నానాసాహెబ్, బహదూర్ షా జాఫర్,మంగళ పాండే,  లాల్,బాల్, పాల్, లాంటి అతివాదులు, గోపాలకృష్ణ గోఖలే,దాదాబాయి నౌరోజీ,ఫీరోజ్షా మెహతా లాంటి మితవాదులు, దేశ కోసం ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి దేశభక్తులు, మహాత్మాగాంధీ లాంటి అహింసా మూర్తులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి త్యాగధనులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నతులు,డా. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిభాఫూలే,జల, జంగల్,జమిన్ కోసం పోరాడిన కుమ్రం భీం,సురు,జాటోత్ ఠాను నాయక్, దేశం కోసం ప్రాణాలర్పించిన భారతమాత ముద్దు బిడ్డల గురించి దేశభక్తి కైతికాల పుస్తకం ద్వారా పరిచయం చెయ్యడం నేటి తరాలకు ఇది ఎంతో దోహదపడుతుందని  వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత రాథోడ్ శ్రావణ్, కవి ఉసావే పూర్వ అధ్యక్షులు, కట్టా. లక్షణాచారి, ప్రచార కార్యదర్శి ఆత్రం.మోతిరాం, కవులు, డా, ఇందల్ సింగ్, జాదవ్ సురేష్, జాదవ్ మురళి,ధరంసింగ్, కుమ్ర లాల్ షావు, పవార్ వినోద్,ముంజం జ్ఞానేశ్వర్,తొడసం నాగోరావు, సాకివార్ ప్రశాంత్ కుమార్,ముంజం మల్లికార్జున్, గోవింద నాయక్, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు