దాశరథిరంగాచార్యులు జయంతి-సీసమాలికపద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467

 సీ.
"అభినవవ్యాసునికంజలించియుముందు"
వాణిముద్దులపట్టివానిదలతు
"చిల్లరదేవుళ్ల"నెల్లరుమెచ్చేల
వ్రాసినమీకీర్తివాసికెక్కె
విప్లవభావాలువిరులుగారచనలో
పూయించిపరిమళాల్పొందుపరిచె
అలనిజామనెరాజునాకృత్యమాలన్ని
ఖండించివేసినదండివాడు
జీవితచరితగా"జీవనయానము"
నాత్మకథగమనకందజేసి
"ఉపనిషత్వేదాలకుక్తివైచిత్రితో"
వ్యాఖ్యానమందించెవైభవముగ
"పద్యములనువ్రాసెపండితులనుతాను"
సత్కరించినగొప్పసద్వివేకి
సాయుధపోరాటసంగ్రామమందున
"కవిసింహమైముందుకదిలినాడు"
"వట్టికోటాళ్వారుబాటలోపయనించి"
నవలలువెలయించిభవితకొసగె 
"అన్నకృష్ణమచార్యులందించెస్ఫూర్తితో"
సాహిత్యరంగానసాగిపోయె
తనదైనశైలిలోమనమనస్సుప్పొంగ
తత్త్వాన్నిబోధించెతాత్త్వికుండు
అక్షరమనెయెడియాయుధమ్మునుబూని
పీడితజనులకుతోడునిలిచి
మనతెలంగాణపుమనతెల్గుకవులకు
సాహిత్యవిలువలుసతమునేర్పి
  (తే.గీ.)
అతడు"వాచస్పతి"గయుండియక్షరాల
సేవజేసియుధార్మికశ్రేష్ఠుడాయె
దాశరథిరంగచార్యులుధరణిపైన
"జనులపక్షాననిలబడిజయమునొందె"!!!

కామెంట్‌లు