01.
తే.గీ.
"సురవరమువారుతెలగాణసూరివరుడు"
నడిపె"గోల్కొండపత్రిక"జడియకుండ
పండితులుమెచ్చెకావ్యాలుపలువిధముల
వ్రాసిఘనకీర్తినొందెనువసుధయందు!!!
02.
కం.
"వైతాళికుడిగవెల్గియు"
ఖ్యాతినిపొందినప్రతాపకవివరుగొల్తున్
నీతియుధర్మముదప్పక
జాతికిసందేశమొసగెసమ్మతితోడన్!!!
03.
కం.
కవులేలేరనియన్నను?
కవులున్నారనితెలిపినఘనుడేయితడున్
కవితాసంకలనంబును
సవినయముగదీసిజూపెశక్తియుతంబున్!!!
04.
కం.
పరిశోధనపరిశీలన
పరిపరివిధములసలిపినపండితమణికిన్
నిరతముదండాలనిడుదు
సురవరమేతెల్గుభాషసొబగులుదిద్దెన్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి