01.
కం.
"సేవేపరమావధిగా"
సేవేభాగ్యమ్మనుచునుజీవించియుతా
సేవేసంతృప్తినొసగు
సేవేనాకిష్టమనుచుసేవలుజేసెన్!!!
02.
కం.
యావత్విశ్వంబుజనులు
నీవేమామదరుథెరిసనీవేయనుచున్
సేవలకొనియాడునెపుడు
పావనచరితార్థురాలుభాగ్యముమాకున్!!!
03.
కం.
పేదలకునురోగులకును
బీదలకునుసేవజేసిప్రియముగథెరిసా
వేదనలెన్నియొబాపియు
నోదార్పునునందజేసినుత్సాహమిడెన్!!!
04.
కం.
"దండముమదరుథెరిస్సా"
దండముకరుణాంతరంగదండముజేతున్
దండముసేవామణికిని
దండమునీకందజేతుత్యాగమయిభువిన్!!!
05.
కం.
మానవలోకమునందున
మానవసేవలుసలిపియుమదరుథెరిస్సా
యేనాడునుతనధర్మము
మానకశ్రమియించెగాదెమాన్యతతోడన్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి