సీ.
నన్నయ్యచేతిలోనవనీతరాశియై
తెలుగుపద్యమ్ముగదిశలవెలిగి
తిక్కన్నశైలిలోతియ్యమామిడివోలె
రసములూరించియురాణకెక్కి
ఎఱ్ఱన్నవర్ణనల్ఎలుగెత్తిచాటించి
తెలుగుకవనశోభదీప్తివిరిసి
పోతన్నకలములోపోతపోసినరీతి
అచ్చతెనుగుపల్కువిచ్చుకొనియె
(ఆ.వె.)
వివిధకవులరచనవెలుగురేఖలుచింది
పసిడితెలుగుశోభమిసిమిగొల్పె
వేలయేండ్లనాటివిజ్ఞానవిభవము
నందజేసెగాదెడెందమలర!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి