251.
చూడచక్కని ఆటలు
ఆరోగ్యమిచ్చు దారులు
కలుగు మనోవికాసములు
చదువుకు అనుకూలములు
252.
ఆహారము ముఖ్యము
ఆలోచనలు శ్రేష్ఠము
నిద్రా అత్యవసరము
ఇలలోనే స్వర్గము
253.
తూర్పున ఉషోదయము
ప్రకృతిలో ఆహ్లాదము
తిలకిస్తే ఆనందము
రెట్టించు ఉత్సాహము
254.
ఉరుములతో మేఘము
వర్షించును మనకోసము
పులకించెను భువనము
నిండేను పచ్చదనము
255.
నిరాశా నిస్పృహలు
కోపాలు తాపాలు
వీడిన సంతసాలు
నిత్యం నీ సొంతాలు
256.
గుండెలోని ప్రేమలు
పారే జీవ నదులు
పెరుగు మమతల పైరులు
పూయు అనురాగ సుమాలు
257.
అనుభూతులు దాచుకో
ఆప్యాయతలు నిలుపోకో
ఒడిదుడుకులు ఎందరికో
దాటాలి జర వినుకో
258.
ప్రజాస్వామ్య విలువలు
కావుము మహానుభావులు
ఓ రాజకీయ నేతలు
ముఖ్యమా సంపదలు
259.
మనలో సోదర భావము
భరోసా నింపు వాక్యము
నేనున్నాననె ధైర్యము
ఆత్మరక్షణ బంధము
260.
మానవీయ కోణము
మమతల నిండుదనము
ప్రేరణా వాక్యము
రాఖి విశిష్టత్వము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి