281.
తెలంగాణా పోరాటము
నవలల వైశిష్ట్యము
వేదముల అనువాదము
దాశరథి గొప్పదనము
282.
రైతాంగ పోరాటాలు
రచనల నేపత్యాలు
ఎన్నో బహుమానాలు
ఘనమే రంగాచార్యులు
283.
తెలంగాణా చరిత్రము
మహోజ్వల వారసత్వము
నిజాం నిరంకుశత్వము
అతని నవలలో లిఖితము
284.
జనపద ఇతివృత్తము
సమాజ ప్రతి బింబము
ఘనమైన సాహిత్యము
రంగాచార్యుల సొంతము
285.
పాత్రోచిత యాసను
వారు ప్రవేశ పెట్టెను
ప్రసిద్దిగా నిలిచేను
గద్య దాశరథి గాను
286.
దాశరథి జీవితము
అందరికీ ఆదర్శము
ఆశించలే ప్రతిఫలము
బాధ్యతా నిర్వహణము
287.
ఘనమైన వారసత్వము
తెలంగాణా సొంతము
చేయాలి అధ్యయనము
దాశరథి సాహిత్యము
288.
తెలంగాణా వీరులు
రంగాచార్య సోదరులు
అన్న కృష్ణమాచార్యులు
వారివి గొప్ప సేవలు
289.
సాంస్కృతిక వైభవము
జీవన పోరాటము
తరాల వారసత్వము
రచనలలొ ఆకర్షణము
290.
ఎందరో వీరులు కవులు
తెలంగాణా ధీరులు
మనకు స్ఫూర్తి దాతలు
దాశరథికి వందనములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి