శార్దూలము:
*వేధం దిట్టగరాదుగాని, భువిలో | విద్వాంసులంజేయ నే* *లా, ధీచాతురిఁచేసిన, గులా | మాబాటనేపోక క్షు*
*ద్బాధాదుల్ కలిగింపనేల యిది కృ | త్యంబైన దుర్మార్గుల*
*నీ ధత్రీశులన్ చెయ నేటికకటా | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
బ్రహ్మ గారిని ఏమీ అనకూడదు గానీ, మమ్మల్ని ఆలోచన గల మనుషులుగా ఎందుకు పుట్టించాడు. పోనీ తనవతెలివి అంతా వుపయోగించి తెలివిహల వారిగా పుట్టించినా, మళ్ళీ ఆకలి దాహం పెట్టాడు. ఇవి యిచ్చి మమ్మల్ని ఏమాత్రమూ, పరిపక్వత లేని రాజులదగ్గరకు పంపాడు ఈ మా ఆకలి, దాహం తీర్చుకోవడానికి. నిన్ను గుర్తు వుంచుకోకుండా చేసే ఇటువంటి తెలివితేటలు మాకు అవసరమా, ఈశానేశా!........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఈ బ్రహ్మ గారు వున్నాడే! ఈయన పరాత్పరుని కడుపున పుట్టాడు అన్నమాటే కానీ, ఒక్కపని చేయడు. ఎందుకూ పనికిరాని, నిన్ను గుర్తించ లేని, తెలివితో మమ్మల్ని పుట్టించి ఏదో గొప్ప పని చేసాను అనుకుంటాడు. ఆది మూలమైన నిన్ను గుర్తించలేనపుడు, మా తెలివి, వుంది అనుకుంటే, అది అంతా వ్యర్ధమే కదా! ఆకలి, దాహం, కోరికల వెనుక పరుగిడుతూ, నీవు అనే బ్రహ్మ పదార్థం గురించి ఆలోచన కూడా చేయలేక పోతున్నాము, మేము. ఈ ఎండ మావుల వెంట మేము చేస్తున్న పరుగును ఆపి, మేము నిన్ను కోరుకుని, నిన్ను చేరుకునే దారివైపు మా దారిని మళ్ళించు, పార్వతీ పతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి