ఎవరు విశ్వవిజేత ?:--- పోలయ్య కవి కూకట్లపల్లిఅత్తాపూర్ హైదరాబాద్... 9110784502

కల గన్నవాడు  
కసి ఉన్నవాడు 
కత్తిలా పదునైనవాడు  

పక్కాప్లాన్ ప్రకారం 
ముందుకు దూకేవాడు 
ముందు చూపుగలవాడు  
పగలురాత్రి శ్రమించేవాడు 

పట్టుదల ఉన్నవాడు 
పడినా లేచి పరిగెత్తేవాడు  
ప్రయ్తత్నాన్ని విరమించనివాడు
పదేపదే గట్టిగా ప్రయత్నించేవాడు 

తింటున్నా తిరుగుతున్నా 
పడుకున్నా నిద్రలో సైతం పని 
పని అని కలవరించే పనిరాక్షసుడు

తల్లిదండ్రుల మాటలు విన్నవాడు 
తన శక్తినే తాను నమ్ముకున్నవాడు 
తన తప్పులుతాను తెలుసుకున్నవాడు 

భయమన్నది ఎరుగనివాడు
భక్తిలో నిండా మునిగినవాడు 
భగవంతునిపై భారం వేసినవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
వాడు విజేత...కాదు కాదు వాడే విశ్వవిజేత.....

కామెంట్‌లు