చిత్రానికి పద్యాలు:-మమత ఐలకరీంనగర్9247593432

 మ*
శరవేగంబున విద్యనేర్చుటకుయా శర్వాని స్థానంబు కై  
పరుగెత్తేవనితల్లి సుందరముగన్ బ్యాగేసె ముస్తాబు తో
మురిపెంతీరెడి గౌనువేసి చరణమ్ముల్ దాచిరే రక్షతో
నురకేవో బడిబాటపట్టి మరినీ నుత్సాహమెంతుండెనో !
కం
తొడిగెను కాళ్ళకు బూట్లను
బడి బాటకు సిద్దమైన భామామణియే
బుడిబుడి యడుగులనేయుచు
మెడలో పుస్తకపు సంచి మెరిసెడి మోమే!

కామెంట్‌లు