1.ఆ.వె.
బాలబాలికలను బడిలోన చేర్చాలి
పనుల కొరకు మీరు పంపరాదు
కూలి కాశ పడిన క్రుంగును బ్రతుకులు
భవిత నష్టమౌను బడినివీడ
2.ఆ.వె.
బాలలంతకలిసి పరుగెత్తి నొకచోట
చేరినారు వారు చెలిమి తోడ
బ్యాగులన్ని దీసి ప్రక్కకు పెట్టియు
నాటలాడుకునిరి హాయిగాను
3.ఆ.వె.
బాల బాలికలను బాలకార్మికులుగ
పంపకూడదెపుడు పనులు జేయ
చదువు నేర్పవలయు చక్కగా వారికి
ప్రగతి పథమునందు పరుగుదీయు
4.ఆ.వె.
విద్య లేని వాడు వింత పశువు గాదె
తెలియరాదునేది తేటముగను
శ్రద్ధ తోడ చదవ సకల శాస్త్రములన్ని
వచ్చి చేరునుగద వదలకుండ
5.ఆ.వె.
పెన్ను చేతబూని పేపరు పైవ్రాయ
అక్షరాలు కుదురు నందము గను
గురువు మెప్పు పొంద గొప్పగానేర్చిన
వన్నెకెక్కు లిపియు మిన్నగాను
6ఆ.వె.
ఎక్కు చుండ వలెను నొక్కొక్క మెట్టును
జీవితమున పైకి చేరగలము
అన్ని మెట్ల నెక్కి యెన్నెన్నొ సాధించి
లక్ష్యములనుజేరు రయము గాను
బాలలు బడికి:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి