ఎందుకురా?(బాలలగేయం):-డి.కె.చదువులబాబు.తెలుగుఉపాధ్యాయుడు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716.

 చీమలు బారులు తీరేదెందుకురా?
తిండిగింజలు తెచ్చేటందుకురా
కోయిలలు కూసేదెందుకురా?
వీనులవిందు చేసేటందుకురా
నెమలులు నాట్యం చేసేదెందుకురా?
నయనానందం ఇచ్చేటందుకురా
చిలుకలు పలుకులు పలికేదెందుకురా?
ముద్దులమాటలు నేర్చేటందుకురా
తేనెటీగలు ఎగిరేదెందుకురా?
తియ్యనితేనెను తెచ్చేటందుకురా
కోతులుగెంతులు వేసేదెందుకురా?
ఆనందాన్ని పంచేటందుకురా
గాలిపటాలు ఎగిరేదెందుకురా?
చుక్కలలోకం చూసేటందుకురా
మొక్కలు పెరిగే దెందుకురా?
పువ్వులుపండ్లు ఇచ్చేటందుకురా
పువ్వులుకాసే దెందుకురా?
దేవునిదగ్గర చేరేటందుకురా
పిల్లలుబడికి పోయేదెందుకురా?
మంచిచదువులు చదివేటందుకురా!
ఉన్నతంగా ఎదిగేటందుకురా!!

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మీ మీరు వ్రాసిన.
గేయం చాలా బాగుంది సార్ మీకు అభినందనలు.