641) మహాలక్ష్మి రావమ్మా
మాదైవం నీవమ్మా
కోరిన వరం ఇవ్వమ్మా
ఇల మమ్ము. ఏలమ్మా !
642) ఈగ ఇల్లు అలికింది
జోరుగా కులికింది
గువ్వ గుడ్డు పెట్టింది
దోమ తెరను కట్టింది !
643) సీమ సరుకు తెచ్చావా
స్రవంతికి ఇచ్చావా
బొంబాయికి వచ్చావా
బొబ్బట్లను మెచ్చావా!
644) నా భారతికి వందనం
ఆమె వస్తే నందనం
ఆరోజు ఇక సుదినం
చేరుతారు మాజనం !
645) చిల్లర కొట్టు చిట్టెమ్మ
బెల్లం నీవు పెట్టమ్మ
వచ్చావా దుర్గమ్మ
చిల్లర ఇక తేవమ్మ !
646) చేసింది అమ్మ పూరి
వంటింట్లోకి దూరి
వంట మనిషిగ మారి
అనడం తప్పు సారీ !
647) నల్ల కోడి ఎగురుతుంది
పామును తరుముతుంది
తను గిరగిర తిరుగుతుంది
గిరిరాజై పోరుతుంది !
648) ముత్యమంతా పసుపు
తీసుకొని వేగ కలుపు
దానిపై దృష్టి నిలుపు
ఔతుంది అది తెలుపు !
649) గిరగిర చక్రం తిప్పు
చేతిలో ఏంటా కప్పు?
కొట్టురా నీవు డప్పు
ముట్టకు ఇక ఆ చెప్పు !
650) దారం కండె ఇలాతే
అది కింద పడిపోతే
తెస్తారో ఎవరైతే
పట్టేది ఇక దుర్గతే !
651) మనసు సున్నితమైనది
ఎంతో ద్రవిస్తున్నది
మనల కవ్విస్తున్నది
అది ఇక రోదిస్తున్నది!
652) మాస్క నీవు పెట్టుకో
కరోనాను తట్టుకో
చెట్టుకో పుట్టకో
కాకుండా పెట్టుకో!
653) వాడు స్తంభాద్రి రెడ్డి
డబ్బుకు తింటాడు గడ్డి
ఈడ కట్టాడు దొడ్డి
ఏడ ఉంది సిరా బుడ్డి !
654) ఆకు సున్నం తీసుకురా
అరటాకు కోసుకరా
అన్నంమూ తీసుకరా
వరసగ పెట్టేసుకరా !
655) ఎవరా వచ్చిన వాడు
సవరం తెచ్చినవాడు
మొహరం ఎన్నడంటడు?
ఊరికే కసురుకుంటడు !
656) డబ్బు పెట్టి కొట్టు పెట్టు
చిటపటలాడుతు తిట్టు
వారిని కసిరి కొట్టు
ఆపైన ఇక తల్పెట్టు !
657) సగం పాలు పోయవద్దు
నిండుగ పోయుట ముద్దు
పాత పద్ధతి ఇక వద్దు
తెలుసుకోరా సిద్దు !
658) రారా ఓ కృష్ణయ్య
ముందుంది పున్నమయ్య
వెన్నెల యేదయ్య
వెన్న దొంగ కన్నయ్య !
659) ఉత్తరం చదువుతున్నది
విషయం తెలియకున్నది
ఎందుకో గునుస్తున్నది
ఆమె తెగ అరుస్తున్నది !
660) దూది పింజ తేలింది
పక్క మీద పడింది
పరుపెంతో చెడింది
వానికి ఇక మూడింది!
661) ముక్కు మీద పుట్టుమచ్చా?
నేను ద్రావణం తెచ్చా
సూది తోని పైన కుచ్చా
అది అయ్యిందిగ అచ్ఛా !
662) కనుసైగ ఇక చేయకు
నా కనులను మూయకు
సంగతులను దాయకు
మత్తుమందు పూయకు !
663) పాలకూర వండిన
ఇంతవరకు పండిన
ఇక్కడనే ఉండిన
నే కానుగా అంజాన !
664) అరటి తొక్క ఉందిగా
కాలేస్తే ఇబ్బందిగా
మాట్లాడకు సిల్లీగా
దొంగ పిల్లి లాగా !
665) పండ్లు బాగా తోము
ఇది తెల్లవారుజాము
వింటున్నావా సోము
మార్చుకో నీ థీము !
666) జెర్రిపోతులాంటి జడ
కదులుతున్నది నీడ
ఎక్కుతున్నావా ఓడ
సరి చేసుకో పావడా !
667) దిగు దిగు మేడ మెట్లు
ఎక్కేందుకా ఈ పాట్లు
పెట్టు నీవు ముచ్చట్లు
కొడతారు చప్పట్లు !
668) గుండు వాడు కొరిగిండు
అద్దంలో చూసుకుండు
మెరుస్తున్నది గుండు
వానికి తెలియదా పాండు
669) నేల తడిగానే ఉంది
చూసుకోమని అంది
ఏమిటి ఇక ఇబ్బంది
అంతటా గబ్బు ఉంది !
670) మీసం పై వేలుతీయి
ఏమి ఈ అలవాటోయి
ఇక మర్చిపోవోయి
సరి సరి మంచిదోయి!
671) కాలుగాలిన పిల్లివా
కదులుతున్నవు మెల్లిగా
వింటున్నావా మల్లిగా
ఇక నీ సిగ ధరగా !
672) కథ కంచి కి వెళ్ళింది
వెతల దారి మళ్ళింది
ముందు సవాల్ అంది
ఆపై తాను ఊకుంది!
673) రా రా వెన్నెల నా దొర
ఈ కన్నియ నీదేనుర
చూడకురా సురసుర
నీ కన్నుల్లో ఉంది మర !
674) సెలవులు వచ్చేసాయిరో
కాస్త నీవు నిలువరో
సాయం ఇక చేయరో
ఈ మూటను మోయరో !
675) పుల్ల విరుపు మాటలొద్దు
అనుట కాదులే ముద్దు
బుగ్గపై వచ్చింది దద్దు
చూసుకో నీవీ పొద్దు!
676) నూకలు నీవు బుక్కకు
ఎవరికి నీవు చిక్కకు
జరుగకు ఇక పక్కకు
ఎక్కడ నీవు నక్కకు !
677) చెట్టు పూలు కాస్తుంది
పండ్లు కూడా ఇస్తుంది
అది ఎత్తుగా పెరిగింది
బరువుతో ఒరిగింది !
678) వచ్చింది మాఘమాసం
మామా మెలెయ్యి మీసం
పెంచుకో ఇక రోసం
ఇస్తాము నీకు గాసం !
679) వసంతకాలం వచ్చింది
ఆనందాన్ని తెచ్చింది
బంధాలను ముడేసింది
విందిచ్చి చిందేసింది !
680 చిలిపి చిన్నది వచ్చింది
నాకు భలేగా నచ్చింది
నా బుగ్గని గిచ్చింది
రచ్చ తాను చేసింది !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి