: తెలుగు ప్రాశస్త్యము:- పిల్లి.హజరత్తయ్య, సింగరాయకొండ. జిల్లా : ప్రకాశం-చరవాణి : 9848606573
1) మాండలికాలకు అతీతమైన భాష
మనసు మెచ్చేటి భాష
మమతను సమతను పంచును రా
చూడచక్కని తెలుగు సున్నితంబు

2) సుందరమైన భాష తెలుగు
తేనెలొలుకు భాష తెలుగు
తెలుగుభాష మనకు వెలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు

 3) అమృతం కురిపించే భాష
ఆలోచన రేకెత్తించే భాష
తెలుగువారి పాలిట కల్పవల్లిరా
చూడచక్కని తెలుగు సున్నితంబు

4) అమ్మ పలుకు వోలె కమ్మనైనది
నాన్న మనసువోలే మధురమైనది
వెన్నెల కురిపించు జీవితాన
చూడచక్కని తెలుగు సున్నితంబు

 5) తెలుగుమాటలు తీయటి ఊటలు
హాయినిచ్చే కమ్మటి పాటలు
తెలుగుభాష ప్రాశస్త్యము గొప్పదిరా
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంశం: విద్యతోనే విషయం వినతి కెక్కు

6) విద్య కీర్తిని ఇస్తుంది
విద్య భోగాన్ని ఇస్తుంది
విద్య మనిషికి రూపాన్నిస్తుంది 
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
7) శీల నిర్మాణమే విద్య
సర్వరోగ నివారిణే విద్య
ఆత్మ సాక్షాత్కారమే విద్య
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
8) విద్య లక్ష్యం సత్యాన్వేషణ
విద్య లక్ష్యం సర్వతోముఖాభివృద్ధి
విద్య లక్ష్యం సార్వజననీక రణం
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
9) జీవిత సమస్యలను పరిష్కరించును
మానసిక శక్తులను అభివృద్ధి చేయును
 దివ్యత్వపు పరిపూర్ణతను వెలికితీయును
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
10)మానవజాతి ప్రగతికి సాధనం
మూర్తిమత్వ వికాసానికి సోపానం
మంచిగా బ్రతకడానికి ఆధారం
చూడచక్కని తెలుగు సున్నితంబు

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
అంశం: *వ్యవసాయం రైతులకు ఇష్టా నిలయం* 

 11) కష్టపడి పంటలు పండించు
అందరికి అన్నము ప్రసాదించు
రైతే దేశానికి వెన్నుముక
చూడచక్కని తెలుగు సున్నితంబు!* 

1 2) పంటలు పండక పోయినా
పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నించు
పట్టువిడిస్తే మనుగడ ప్రశ్నార్ధకం!!
చూడచక్కని తెలుగు సున్నితంబు!* 

13) సేద్యం చేసేది ఒకడు
ఫలాలు అనుభవించేది మరొకడు
రైతే రాజయ్యేది ఏనాటికో...?
చూడచక్కని తెలుగు సున్నితంబు!* 

  14) ప్రకృతి పగబట్టింది రైతన్నపై
ప్రభుత్వాలు మరిచాయి రైతన్నను
ఆత్మహత్యలే శరణ్యమాయే రైతన్నకు
చూడచక్కని తెలుగు సున్నితంబు!*

 15) భుక్తిని అందించేవాడు రైతు భుక్తికోసం పరితపించేవాడు రైతు
రైతే దేశానికి సౌభాగ్యం
చూడ చక్కని తెలుగు సున్నితంబు!

అంశం..మగువ మానవలోకానికి దేవత

16) స్త్రీ సృష్టికి మూలము
స్త్రీ శక్తి స్వరూపము
స్త్రీ జగత్తుకు ఆధారము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

17) పడతి సహనానికి ప్రతీక
అమ్మ రూపానికి మాతృక
భూమికి దేవుడిచ్చిన వరం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

18) ఇలలో వెలసిన దేవత
అమ్మగా,ఆలిగా మురిపించు
మహిళలే ఇంటికి వెలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

19) ఆకాశాన్ని జయించింది మహిళ
ఆత్మవిశ్వాసం కనబరిచింది మహిళ
అవనిపై మేటియైనది మహిళ
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

20) మహిళలపై వివక్షత మానాలి
మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలి
మహిళా సాధికారత సాధించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

*అంశం: తరువు మానవ ఆదెరువు
****************
21) చెట్లు భూసారాన్ని రక్షించు
ప్రకృతి సోయగాలు చేకూర్చు
వ్యవసాయంలో ప్రధానపాత్ర పోషించు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 22) అలంకార వస్తువులకు పెట్టిందిపేరు
పోషక విలువలకు ప్రధానవనరు
ప్రకృతి సంరక్షణ మనబాధ్యత
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 23) మానవ మనుగడకు ఆధారం
పచ్చదనం ప్రగతికి సంకేతం
భవిష్యత్తు తరాలకు జీవనాధారం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 24) చెట్లు ఆరోగ్యానికి నిలయాలు
మానవాళికి ఆర్థిక వనరులు
దేవుడు మనిషికిచ్చిన వరాలు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

25) పర్యావరణానికి చెట్లు ప్రాణాలు
జీవనానికి మూలం మొక్కలు
మొక్కలు నాటడం దేవకార్యం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*


అంశం: జలం మానవ బలం

26) జలము ప్రాణులకు  ప్రాణాధారము
జలము ప్రగతికి మూలాధారము
జలమే జగమునకు జీవనాధారము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

27)జలము జీవులన్నిటికి అత్యవసరము 
మానవాళి మనుగడకు ముఖ్యము
ప్రకృతి ప్రసాదించిన వరము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

28) తరుగుతోంది జల నిధి
పెంచడం మన విధి
జలమే మన సన్నిధి
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

29) నీటిని ఒడిసి పట్టు
కరువును తరిమి కొట్టు
భావితరాలకు ప్రాణభిక్ష పెట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

30) జలము త్రాగుటకు అవసరము
జలము పంటలకు ప్రధానము
జలమును వృధాచేయడం నేరము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

అంశం: కార్తీకమాసంబు కడు మహత్వంబు

31) కార్తీక మాసం మహి మాన్వితమైనది
శివ కేశవులకి ప్రీతికరమైనది
స్నానములకు, వ్రతములకు శుభప్రదమైనది
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

32) వేదములకు సమానమైన శాస్త్రములు
గంగకు పుణ్యప్రదములైన తీర్థ ములు
కార్తీకమాసమునకు సమానమైనవి లేవు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

33) కార్తీకదీపాలు నదిలో వెలిగించు
కేదారేశ్వర వ్రతం గావించు
నదీ స్నానాలు ఆచరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

34) కార్తీకపౌర్ణమికి విశిష్టత ఎక్కువ
శివుని అనుగ్రహం కలుగు
సకల దోషాలు తోలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

35) ఉపవాస దీక్షలు ఆచరించు
స్నానం పుణ్యఫలాలను ప్రాప్తించు
దానం సౌభాగ్యాలను కలిగించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

 అంశం:8 తుంగభద్ర పుష్కరాలు
        
 36)గురుడు మకరరాశిలో ప్రవేశించు
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించు
ఆంధ్రప్రదేశ్  వైభవంగా నిర్వహించు
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
        
37)తుంగభద్ర పంచగంగలో ఒకటి
తుంగభద్ర పుష్కర ఘాట్ లలో
అలంపూర్, మంత్రాలయం ప్రముఖమైనవి
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
             
38)పుష్కర స్నానం పుణ్యప్రదము
స్నానాలు ఆచరించిన శుభము
పోగొట్టు మానవుని పాపము
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
           
39)పితృదేవతలకు తర్పణాలు గావించు
పూజలు,దానాలు ఆచరించు
పన్నెండు రోజులు స్నానమాచరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
          
40)జీవరాసులకు ప్రధానమైనది జలము
నదీ స్నానము ఆరోగ్యాన్నిచ్చు
నదీస్నానాన్ని గుర్తుచేసేవే పుష్కరాలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

9వఅంశం: శ్రీ శ్రీ
****************
41)కవిత్వసీమను విశాలతరం చేసి
అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగించిన
తెలుగుసాహిత్యపు మహాకవి శ్రీ శ్రీ
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

42)ఇతిహాసపు చీకటి కోణాలను
దాచేస్తే దాగని సత్యాలను
వెలికితీసిన మహానుభావుడు శ్రీ శ్రీ
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

43)దీనులను హృదయానికి హత్తుకున్నాడు
హీనులకోసం కలం పట్టి
అభ్యుదయ కవులకు ఆదర్శప్రాయుడైనాడు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

44)సంఘనీతిని,కట్టుబాట్లనుధిక్కరించినాడు
ఉద్యమాలలో చురుకైనపాత్ర వహించినాడు
తెలుగుజాతికి వెలుగుబాటను చూపినాడు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

45) లోకం ప్రతిఫలించే విధంగా
జాతిజనులు పాడుకునే మంత్రంగా
కవిత్వాన్ని తెలుగుజాతికి అందించినాడు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

*అంశం: శ్రమ శక్తి

 46) రక్తాన్ని చెమటగా ధారవోసి
రేయనక పగలనక కష్టించి
సమాజగతిని మార్చే శ్రామికులం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 47) దళారులు మోసం చేసినా
ఆశించిన ప్రతిఫలం రాకున్నా
 శ్రమనే ఆయుధంగా నమ్మినవాళ్ళం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 48) ప్రజల ఆకలిని తీర్చుతాం
దేశప్రగతికి పునాది వేస్తాం
జాతి భవిష్యత్తును నిర్మిస్తాం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

49) కార్మికచట్టాలు ఎన్ని ఉన్నా
జీవన పోరాటంలో ఓడుతాం
హక్కుల సాధనకై ఉద్యమిస్తాం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

50) కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా
సామాజిక భద్రతే లక్ష్యంగా
సమసమాజ స్థాపనకు కృషిచేస్తాం
*చూడచక్కని తెలుగు సున్నితంబు


*అంశం: గీతాంజలి కావ్యం

51) రవీంద్రుని రచనలలో గొప్పది
ప్రపంచ సాహిత్యంలో మహోన్నతమైనది
గీతాంజలికి నోబెల్ లభించింది
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

52) గీతాంజలి భక్తిగీతాలకు ప్రసిద్ధి
శ్రమ గొప్పతనాన్ని చాటింది
సృష్టిని ప్రేమభావంతో చూపింది
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

53) స్వేచ్ఛా గీతానికి మానవరూపం
మానవ సంబంధాలకు మచ్చుతునక
మాతృభూమికి, దేశభక్తికి మాతృక
*చూడచక్కని తెలుగు సున్నితంబు

54) నేలను దున్నే రైతు
రాళ్లను పగలగొట్టే శ్రామికుడు
కనిపించే పరమాత్ములుగా ప్రస్తుతించింది
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

55) మానసిక వికాసాన్ని వివరించింది
ప్రకృతిని యధేచ్చగా పలకరించింది
విజ్ఞానాన్ని స్వేచ్ఛగా విహరింప జేసింది
చూడ చక్కని తెలుగు సున్నితంబు

*అంశం: హెల్మెట్ రక్ష

56) హెల్మెట్ రక్షణ కవచం
ప్రమాదంలో ప్రాణం కాపాడును
నీప్రాణమే నీకుటుంబానికి ఆధారం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

57) రోడ్డు భద్రత విద్య
బోధిస్తుంది భద్రతా మార్గాలు
హెల్మెట్ ధరించడమే భద్రత
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

58) హెల్మెట్ తప్పక ధరించు 
జరిగే ప్రమాదాలను నివారించు
కొన్నిసార్లు హెల్మెట్టే  జీవనదాత
చూడ చక్కని తెలుగు సున్నితంబు

59) ప్రయాణం ప్రమాదాలు ఝరి
హెల్మెట్ ధరించు మరి
ప్రమాదం రానీకు నీదరి
చూడ చక్కని తెలుగు సున్నితంబు

60) ప్రయాణంలో హెల్మెట్ ధరించి
అందరికీ ఆదర్శంగా నిలువు
నిను నమ్ముకున్నవారికి భరోసానివ్వు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

*అంశం: కరోనా కష్టాల్లో మనోధైర్యం 

61) కరోనా కోరలకు చిక్కవద్దు
ఇల్లు,ఒళ్ళును గుల్లచేస్తుంది
మనోధైర్యమే కరోనాకి మందు  
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

62) ఆశలను ,ఆశయాలను ఛిదిమేస్తుంది
ప్రాణాలను చితికి వేలాడదీస్తుంది
మానసికసంఘర్షణను జయించు ముందు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

63) కరోనా జీవితాలను చుట్టేస్తుంది
కుటుంబాలు కుటుంబాలనే మింగేస్తుంది
స్వీయనియంత్రణే మనకు శిరోధార్యము
*చూడచక్కని తెలుగు సున్నితంబు

64) ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తుల ఆర్తనాదాలు
మనుషుల్లో తీరని మనోవేదనలు
ఒత్తిడిని నివారించడమే దివ్యౌషధము
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

65) ధైర్యంతో ముందుకు సాగు
కరోనా వ్యాక్సిన్ ని  స్వీకరించు 
మనోనిబ్బరంతో కరోనాను జయించు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

 ఇచ్చిన అంశం:: చిరునవ్వు

66) చిరునువ్వు సుముఖతకు నిదర్శనము
ప్రేమకు,కరుణకు చిరునామా
జగతి మెచ్చిన సుగుణము
*చూడచక్కని తెలుగు సున్నితంబు

 67)  చిరునవ్వు వేలప్రశ్నలకు  సమాధానము
కొండంత బాధకు ఉపశమనము
కడవంత సమస్యకు పరిష్కారమార్గము
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

68) చిరునవ్వు ప్రసన్నతను సూచించు
రోగనిరోధక శక్తిని పెంపొందించు
మానసిక ఒత్తిడిని తగ్గించు
చూడచక్కని తెలుగు సున్నితంబు*

 69) ముఖ సౌందర్యాన్ని పెంచు
మనిషి ఆవేశాన్ని తగ్గించు
మనసును తేలిక గావించు
చూడచక్కని తెలుగు సున్నితంబు*

70) శ్రీ రాముని స్మితభాషిత్వం చిరునవ్వు
మనిషికి నిర్మలత్వం చిరునవ్వు
ఎట్టిపరిస్థితుల్లోనూ చిరునవ్వును చెరగనీయకు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంశం:-మొక్కలు నాటు-సంరక్షించు

 71) చెట్లు ప్రాణవాయు ప్రదాతలు
నేలను పరిరక్షించు వాహకాలు
ఉష్ణోగ్రతను నియంత్రించు సాధనాలు
చూడచుక్కని తెలుగు సున్నితంబు 

72) నిస్వార్ధానికి నిలువెత్తు రూపాలు
మన బతుకు దెరువులు
మానవాళికి పట్టుగొమ్మలు చెట్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు
 
73) మానవాళి మనుగడకు ఆధారాలు
పర్యావరణ పరిరక్షణ కారకాలు
కాలుష్య నివారణా ఔషధాలు
చూడచుక్కని తెలుగు సున్నితంబు 
 
74) జీవ వైవిధ్య సంరక్షకాలు
పర్యావరణ సమతుల్యతకు నిదర్శనాలు
జీవితానికి వెలుగు రేఖలు
చూడచుక్కని తెలుగు సున్నితంబు
 
75) చెట్లను నాటి సంరక్షించుకుందాం.!
భవిష్యత్తు తరాలను రక్షించుకుందాం.!
భావి భారతాన్ని నిర్మించుకుందాం.!
చూడచుక్కని తెలుగు సున్నితంబు

అంశం:- తొలకరి చినుకు

 76) 
 తొలకరిజల్లు ముత్యమై మెరిసింది
ఆశల ఊసులను మోసుకొచ్చింది
ప్రకృతి మాతను సింగారించింది
చూడచక్కని తెలుగు సున్నితంబు 

77)
తొలకరి చినుకు కురిసింది 
చేలల్లో నీరు ఇంకింది
విత్తనం మొలకెత్తి మురిసింది
చూడచక్కని తెలుగు సున్నితంబు
 
78)
వర్షం అవనిని పలకరించగా
రైతన్న భూములకు దండమెట్టగా
పంటల సాగుకు సిద్ధమవ్వగా
చూడచక్కని తెలుగు సున్నితంబు 
 
79)
తొలకరి జల్లులు రావాలి
వాగులు వంకలు నిండాలి
పంటలు బాగా పండాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు
 
80)
తొలకరి చినుకులు జల్లులు
పుడమికి పచ్చని హారాలు
మానవ మనుగడకు ఆధారాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంశం:- నిత్య జీవితంలో యోగా

 81)
యోగ రక్షణ కవచం
యోగా ఆరోగ్య సాధనం
యోగా కనిపించని ఔషధం
చూడచక్కని తెలుగు సున్నితంబు 

82)
మానసిక ఏకాగ్రత పెంచును
మానసిక ప్రశాంతతను పెంపొందించును
వ్యాధుల తీవ్రతను తగ్గించును
చూడచక్కని తెలుగు సున్నితంబు

83)
వ్యాధి నిరోధకతకు సూర్యనమస్కారాలు
మానసిక ఆరోగ్యానికి ప్రాణాయామాలు
ఒత్తిడి తగ్గించడానికి బంధములు
చూడచుక్కని తెలుగు సున్నితంబు 
 
84)
దేహ దారుఢ్యానికి ఆసనాలు
మోక్ష సాధనకు ధ్యానములు
ముద్రలు, క్రియలు ప్రధానములు
చూడచుక్కని తెలుగు సున్నితంబు

85)
వ్యాయామ సాధనాల సమాహారమైనది
ఆధ్యాత్మిక సాధనాలకు పునాది
ఆరోగ్యమనే మహాభాగ్యానికి దివ్యమైనది
చూడచుక్కని తెలుగు సున్నితంబు

అంశం:- పివి గారి ఆర్థిక సంస్కరణలు

86)
పాములపర్తి వంశానికి దత్తపుత్రుడు
దేశభక్తి లక్షణ సమన్వితుడు
దేశంకోసం శ్రమించిన మహోన్నతుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు 

87)
ఆర్థిక సంస్కరణల పితామహుడు
రాజనీతిలో అపర చాణిక్యుడు
సాహితీ సమరాంగణ సార్వభౌముడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

88)
ప్రధానిగా నిలిచిన తెలుగుతేజం
సౌమ్యత సహనం శాంతస్వభావం
నవభారతనిర్మాణం ఆయన లక్ష్యం
చూడచక్కని తెలుగు సున్నితంబు 
 
89)
సరళీకృత విధానాలను ప్రవేశపెట్టెను
కుంటుపడిన దేశభక్తిని పట్టాలెక్కించెను
భారతదేశాన్ని మేటిదేశంగా తీర్చిదిద్దెను
చూడచక్కని తెలుగు సున్నితంబు

90)
భారతీయమేధస్సును ప్రపంచవ్యాప్తం చేసే
దౌత్యసంబంధాలలో తనదైన ముద్రవేసే
భారత అభివృద్ధికి బీజంవేసే
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంశం:సైనికులకు వందనం

91) హిమాలయ శిఖరం అంచున
పరిస్థితులు అనుకూలించక పోయినా
రక్షణకై రాజీపడని ధీరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

92) జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలి
జన్మభూమి రుణం తీర్చుకోవడానికి
నిరంతరం శ్రమిస్తున్న శూరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

93) మరణం తథ్యమని తెలిసినా 
ప్రాణాలను లెక్కచేయక శత్రుసైన్యాలను
తుదముట్టించే వీరులే జవాన్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు

94 దేశం కోసం ప్రాణాలనిచ్చి
ప్రజల హృదయాలలో కొలువైన
రక్షక దేవుళ్ళ జవాన్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు

95)వెన్ను చూపని సాహసికులు
తెగువను చూపే త్యాగధనులు
మరణాన్ని ముద్దాడే మృత్యుంజయులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంశం : డాక్టర్ ఏ.పీ.జే అబ్దుల్ కలాం

96) సామాన్య కుటుంబంలో జన్మించి
అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శించిన
మహోన్నత శిఖరం కలామ్
చూడచక్కని తెలుగు సున్నితంబు

97) యువత కళల సాకారమై
సాంకేతికతకు ఆలంబనమై నిలిచిన
సిసలైన భారతరత్నం కలామ్
చూడచక్కని తెలుగు సున్నితంబు

98) దేశ శ్రేయస్సే పరమావధిగా
నిస్వార్థ ఒంటరి జీవితాన్ని
ఎంచుకున్న సేవా రూపమతడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

99) కలలు కనండి అంటూ
కష్టాల్లోనే విజయాన్ని వెతకండంటూ 
జీవితసారం బోధించిన జ్ఞానియతడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

100) కలాం జీవితం స్ఫూర్తిదాయకం
ఆయన సేవలు చిరస్మరణీయం
వారి మార్గం అనుసరణీయం
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు