ఇంటా -బయట .. !! (గారాభం ) డా . కె ఎల్ వి ప్రసాద్ >హన్మకొండ 9866252002

                    పిల్లలు ఉన్నచోట అల్లరి తప్పదు . అల్లరి పిల్లలుకాకుంటే ఇంకెవరు చేస్తారు అనే పెద్దలు కూడా వున్నారు . అసలు అల్లరి అంటే ఏమిటీ ?అల్లరి అనేది పిల్లలు చేస్తే ఒకలా ఉంటుంది ,పెద్దలు చేస్తే మరోలావుంటుంది . పిల్లలు చేసే అల్లరి క్షమించదగ్గ
దిగా ఉంటుంది . పెద్దలు చేసే అల్లరికి వెనుక ఏదో కారణం కుట్ర ఉంటాయి . పిల్లలు 
అల్లరి చేయడం తెలియక చేసేది ,అల్లరి అంటే చేయకూడనిదీ అని తెలియక పిల్లలు చేసేది . ఒక సమస్యను అడ్డం పెట్టుకుని చేసే అల్లరి పెద్దలది. ఇక్కడ చిన్నపిల్లలా అల్లరి గురించే చెప్పుకుందాం . 
ఒకచోట కుదురుగా లేకపోవడం ,ఇల్లుపీకి పందిరివేయడం వంటి పనులు చేయడం 
వస్తువులు వున్నచోట ఉంచకుండా తీసిపారేయడం ,వస్తువుల విలువ తెలియక తీసి క్రింద ఎత్తి పారేయడం ,వద్దన్నపనులు తప్పకుండాచేసే ప్రయత్నం చేయడం ఇలా చేయవలసినదానికి మించి అతిగా చేసే పనులను అల్లరి అంటాము . పిల్లల అల్లరి పూర్తిగా తల్లిదండ్రులమీద ఆధార పడివుంటుంది . ‘ పిల్లవాడు .. వాడికేమి తెలుసు .. ‘ అనే ధోరణిలో కొంతమంది తల్లిదండ్రులు భావిస్తారు . తెలియని విషయాన్ని తెలియచెప్పకపోగా ,పిల్లలను వెనకేసుకు రావడం వాళ్ళను ,వాళ్ళ భవిష్యత్తును చేతులారా పాడుచేసినట్టు అవుతుంది . అందుకే ‘’ మొక్కై వంగనిది 
మానై వంగునా ?’’ అన్న సూక్తి ఇక్కడ అక్షరాలా పనికి వస్తుంది . అందుచేతనే పిల్లల అల్లరిస్తాయి శృతి మించుతుందన్న పరిస్థితి వచ్చినప్పుడు ,ముందు మంచి 
మాటలతో,అది పనిచేయనప్పుడు నయానా ,భయానా అల్లరి స్థాయిని తగ్గించాలి . 
అల్లరి ఎందుకు చేయకూడదో అర్ధం అయ్యేట్లు పిల్లలకు చెప్పాలి . అల్లరితో అనుకు
న్నవి సాధించుకునే పిల్లలూ వుంటారు . ఆ బాధ పడలేక వాళ్ళు అడిగినవి ఇచ్చే
సి తల్లిదండ్రులూ వుంటారు . ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా తెలివిగా ప్రవర్తించాలి . లేకుంటే పిల్లలు అల్లరిని ఆయుధంగా చేసుకుని అనుకున్నవి సాధిం
చుకోడానికి అలవాటు పడిపోతారు పిల్లల భవిష్యత్తుకు ఇదొక పెద్ద మరక అవుతుం
ది . 
కొంతమంది పిల్లలు స్వంత ఇంట్లో అల్లరిచేసినట్టే ,బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు ,రెచ్చిపోతుంటారు . తల్లిదండ్రులు చూస్తూవూరు 
కుంటారుతప్ప పెద్దగా పట్టించుకోరు . అడగకుండా టి వి ఆన్ చేయడం ,రేడియో పెట్టేయడం ,రెఫ్రిజిరేర్ తీసి చూడడం వంటి పనులు చేస్తారు . ఈ అల్లరికి ఇంటి యజమానులు చెప్పలేక ,ఊరుకోలేక ,ఏమి చేయలేని స్థితిలో సతమత మై పోతుంటారు . ఒకోసారి ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమీ చేయలేక ,తమ అసాహాయత
కు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది . పిల్లలపట్ల గారాభం ఉండవలసిందే కానీ శృతి మించకూడదు . ఇక్కడ మంచికి -చెడ్డకూ తల్లిదండ్రులే బాధ్యులు !!
                                       ***

కామెంట్‌లు
శ్యామ్ కుమార్. Chagal. 9347220957 చెప్పారు…
పిల్లలది మరి పెద్దల అల్లరి అన్నది ఎప్పటి నుంచో మనం చూస్తున్న విషయమే కానీ దాన్ని చాలా చక్కగా వివరించారు డాక్టర్ కె.వి ప్రసాద్. నిజమే పిల్లల అల్లరి కి ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. మనకు నచ్చని పనులన్నీ కూడా మనకు అల్లరి కనబడుతుంది. అల్లం ని కట్టడి చేయడానికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దలు కఠినంగా ప్రవర్తించకూడదు అని ఒక సరికొత్త భావన ఊపిరి పోసుకుంది. పిల్లలను ఏ విధంగా పెంచాలి అన్న విషయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త మానసిక వైద్య ప్రణాళికలు ఆచరణలోకి వస్తున్నాయి. అవి ఎంతవరకు అనుకున్న స్థాయిలో ఫలితాన్నిస్తా యో వేచి చూడాలి. అంతే!