ఇంటా -బయట .. !! (బొమ్మల తిండి ) డా . కె ఎల్ వి ప్రసాద్ (హన్మకొండ )9866252002.

 పిల్లలు, పాలు -పళ్ళ రసాలవంటి ద్రవ ఆహార పదార్ధాల స్థాయి దాటిపోయిన తర్వాత ‘ అన్నప్రాసన ‘ వంటి తతంగాలు పూర్తి చేసి ,ఆ తర్వాత ఘన పదార్ధా
లు తినిపించడం మొదలు పెడతారు . ఈ వయస్సులో పిల్లలకు తిండి తినిపిం
చడం పెద్ద సవాలే !ఎందుచేతనంటే ఘన పదార్ధాలు తినడం ఒకేసారి కొత్తఆవు 
తుంది . ఆహరం నమలడం అనే ప్రక్రియ సహజ సిద్దంగానే అప్పుడప్పుడే నేర్చు కోవడం మొదలుపెడతారు . అదికూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది
తొందరపెడితే నమలడం మాని మింగడం మొదలు పెడతారు . అందుకనే పిల్లల్ని ఎత్తుకుని పాటలు పాడుతూ ఓపిగ్గా మెలమెల్లగా తల్లి తినిపిస్తుంది.
అది ఒకపట్ఠాన అయ్యేపనికాదు . తల్లికి ఈ విషయంలో ఎంతో నేర్పు-ఓర్పు 
సహనం అవసరం . ఈ లక్షణాలు లేని తల్లి విసుక్కుంటూ తినిపించడం ,లేదా 
ఒక్కోసారి వీపు మీద దెబ్బలు వేసే అమ్మలు కూడా వుంటారు . ముఖ్యంగా 
ఆ వయస్సులో పిల్లలకు తల్లి ,బిడ్డకు తిండితో పాటు ప్రేమను కూడా పంచిన--
ప్పుడు మాత్రమే ఆ పిల్లలు తల్లిదగ్గర పూర్తి స్థాయి ప్రేమను పొంది తిన్న తిండి
కి ,పూర్తి సార్ధకతను పొందుతారు . తిన్న ఆహారం చక్కగా జీర్ణమై రక్తంగామారి 
బిడ్డకు పుష్టిని కలిగిస్తుంది . 
ఆధునిక కాలంగా చెప్పబడే ఈరోజుల్లో అంతా యాంత్రిక జీవితం అయిపొయిం
ది .ఉద్యోగిని అయిన తల్లి అయితే ఆధునికత మరింత రెట్టింపు అయి ఈ ఆహరం తినిపించే ప్రక్రియ ఆయాల చేతికో ,పనిమనుష్యుల చేతికో వెళ్లి పిల్ల 
లకు మరింత కష్టకాలం ప్రాప్తిసుంది . పిల్లల తిండి పూర్తిగా యాంత్రికం అయి-
పోతుంది . అంతా సంరక్షకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది . 
అయితే అందరూ ఇలానే ఉంటారని చెప్పలేముగాని,పూర్తిగా నమ్మేటట్లు ఉండదు పరిస్థితి . పని మనుష్యుల చేతితో పిల్లలకు ఆహరం తినిపించడం ఇష్టం లేని తల్లులు కొందరు ,ఆహరం తినిపించడానికి ‘ చంచా (స్పూన్ )వాడి 
స్తారు . ఇది పూర్తిగా కృత్రిమ ప్రక్రియ ,బిడ్డకు తృప్తినివ్వని ,వంటపట్టని వ్య-
వహారం !కొందరు ఇలా స్పూన్ వాడడం ఆధునికత్వం అనుకుని పొరబడుతుం
టారు . మరికొంతమంది పరిశుభ్రతకు ఇదే మంచి సాధనం అనుకుని భ్రమ--
పడుతుంటారు. కానీ అది పద్దతి కాదు. ఏమాత్రం వీలున్నా చేతితో తినిపించడ
మే మేలు . అంతమాత్రమే కాదు . సాధ్యమయినంత త్వరలో పిల్లలు స్వయం
గా చేతితో కలుపుకుని తినే అలవాటు చేయాలి . మొదట్లో చిందరవందరగా అన్నం పడేస్తారు తెలియక . క్రమంగా నేర్చుకుంటారు .
ఇప్పుడు పిల్లలు గొడవచేయకుండా ఒకచోట కూర్చుని తిండి తినడానికి ఆధు
నిక తల్లి కనిపెట్టిన సాధనాలు ‘ టీవి,ట్యాబ్ ,మొబైల్ ‘ వీటిలో కార్యక్రమాలు చూపిస్తూ పిల్లలకు తిండి తినిపిస్తున్నారు . కేవలం వారి సౌలభ్యం కోసం పిల్లలకు ఈ అలవాటు చేయడం ఎంత దారుణం . తర్వాత కాలంలో పిల్లలు అవి లేకుండా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది . ఆ తర్వాత పిల్లలు పూర్తిగా వీటికి బానిసలుగా మారే ప్రమాదమూ వుంది . అందుచేత తల్లి దండ్రులు ,సంరక్షకులు ముఖ్యంగా తల్లులు ఈ విషయంలో అప్రమత్తంగా 
ఉండాలి . ఈ అలవాటు చేయక పోతేనే మంచిది . ఏ ఇతర అంశాల మీద ద్యాస లేకుండా ప్రశాంతంగా భోజనం తినేలా పిల్లలకు నేర్పించడం తెలివైన తల్లి 
తెలివిగా చేయవలసిన పని . తల్లులూ ఆలోచించండి !పిల్లల ఆరోగ్యం భవిష్య--
త్తు మీ చేతిలోనే ఉందన్న విషయం మర్చిపోకండి . 
                                   ***

కామెంట్‌లు