ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందని
పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని యువత
ఆత్మహత్యకు పాల్పడుటక్షణికావేశము!
వినుము కేఎల్వీమాట నిజముసుమ్ము !!
కోర్కెలు అనేకము కారణములు అనేకము
అవసరాల చిట్టా దానికి అంతుండదు మరి
అన్నమాట చెల్లలేదని ఆత్మహత్య తగునా ?
వినుము కేఎల్వీమాట నిజము సుమ్ము !!
స్నేహము పేరుతొ చిలకపలుకులు పలికి
స్వార్ధము ముసుగులోసయ్యాటలాడుదురు!
ఓటమిని భ్రమించి బ్రతుకు కడదేర్చుకొనుటెల ?
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!
కట్నకానుకల కోర్కెలతో పీడింతురు కొందరు
సూటీపోటి మాటలతో సాధింతురు శాడిస్టులు !
ఆ క్షణికావేశములో ఆత్మహత్యపరిష్కారమా ?
వినుము కేఎల్వీమాట నిజము సుమ్ము .. !!
పేదరికము తెలిసికూడా పదిమందినికనుటెల ?
పెంచలేక పిరికితనంతో వారిని హతమార్చనేల?
కన్నకడుపు తీపి అచ్చట కానరాదెందుకో కదా !
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !!
కష్టపడి ఇష్టముగా చదువుకొను పిల్లలు
ఆడుతూపాడుతూ అనుకున్నది సాధించు!
తల్లిదండ్రులు కన్నకలలు వమ్ము కాబోవులే
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!
పిల్లల మేధస్సును అంచనావేయకుండానే ,
రకరకాల వత్తిడులతోరాంకులాశించుటమేలా
తగదు తగదు గాక తల్లిదండ్రుల ఆలోచన ..
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!
స్టేటు రాంకుల నాశించి కళాశాలల పెద్దలు
కార్పొరేట్ చదువులపేరకఠినంగాప్రవర్తింతురు!
ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థుల గతిఆలోచించరు,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి