జీవనరాగం .. !!: -డా . కె ఎల్ వి ప్రసాద్ హన్మకొండ (9866252002)prasadkanety@gmail.com
పురాణాలూ ఇతిహాసాలలో పొందుపరిచారు 
మనసంస్కృతి సంప్రదాయాలూ పండుగలు 
ముందుచూపుతో మన పండితోత్తములు .. 
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!

ద్రౌపది కృష్ణమూర్తిల అన్న చెల్లెళ్ళ గాధ 
చీరచింపి మణికట్టుకు కట్టిన ఉదంతం 
సోదరుడిపై రక్షకుడిగా గట్టి భరోసా కదా 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!

అన్నా చెల్లెళ్ళ అనురాగానికి చిహ్నం 
రాఖీ బంధనం చెప్పకనే చెబుతున్నది 
ఉత్తరాదిన దీని  ప్రాముఖ్యత మెండులే  
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!

రక్షాబంధన్ -రాఖీ పౌర్ణమి -శ్రావణ పౌర్ణమి 
జంధ్యాల పూర్ణిమ అంతా అర్ధం ఒక్కటే .. 
ప్రాంతాలనుబట్టి పేర్లు మారుతాయిలే …. 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!

అన్నాచెల్లెళ్లు -అక్కా తమ్ముళ్లు మధ్యన 
ప్రేమానురాగాలకు సూచకం ఈ పండుగ 
శ్రావణ పూర్ణిమనాడే ఈ రాఖీ పూర్ణిమ 
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!

అన్నచెల్లెళ్ల మధ్య అక్కాతమ్ముళ్ల మధ్య 
ప్రేమానురాగ బంధాలు నిలవాలి కలకాలం 
రక్తసంబంధాలెప్పుడూ నిత్యజీవిత బంధాలు 
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!

                   ***

ఫోటోలో:-అన్న.....వినోద్ --చెల్లి.....చెర్రి.


కామెంట్‌లు
Shyam kumar చెప్పారు…
రాఖీ పౌర్ణమి గురించి డాక్టర్ కె వి రాసిన కవిత చాలా అందంగా మధురంగా ఉంది. రాఖీ పౌర్ణమి గొప్పతనం గురించి వివరిస్తూ ఇతిహాసాల్లో కూడా తనకు మంచి పరిచయం ఉందని నిరూపించారు. వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇద్దరి ఫోటోలు రాఖీ కడుతూ ప్రచురించడం చూడటానికి చాలా ఆనందదాయకం. సందర్భానికి తగినట్లుగా అంటే సందర్భోచితంగా వెంటనే కవితలు రాయడం కూడా ఒక గొప్ప కల మాత్రమే కాకుండా సమయస్ఫూర్తి కూడా. వైద్య రంగంలో సేవలు చేస్తూ సాహిత్య రంగంలో కూడా తను కృషి చేయడం అన్నది చాలా విచిత్రం కదూ
Ramakrishna.ordinance factory.medak చెప్పారు…
Good experiences .