పుష్ప జాతులు: పారిజాతం పువ్వులు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌దివి నుండి వచ్చింది
     భువి పైన వెలసింది
      పారిజాత వృక్షము
                  ఓ తెలుగు బాల!
👌పారిజాతం.. మంచి సువాసన గల తెల్లని పువ్వుల చెట్టు. దీనికి పలు పేరులు కలవు.
👌సముద్రము నుండి పుట్టినది కనుక, "పారి జాతం"! అంతటా శుభములు కలది. కనుక, "పారి భద్రము"! ఆరోగ్యము కలిగించు నది. కనుక, "నింబ తరువు"! సూక్ష్మము లయిన ముండ్లు కలది. కనుక, "మందారము"!.. అని, "అమర కోశము" నిర్వ చించింది.
👌ద్వాపర యుగములో.. శ్రీ కృష్ణుడు, స్వర్గ లోకం నుండి పారిజాతం వృక్షమును తీసుకొని వచ్చి; ప్రియ సఖి యగు సత్య భామకు బహూక రించాడని, పురాణ గాథ!
కామెంట్‌లు