*ఇంటివెలుగు*. *(పద్యాలు)*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

 *కం*

ఇంటికి వెలుగే ఇల్లాలు
ఇంటికికనుపాపతీరుకాపునుగాయున్ 
మింటనుజాభిలితళుకులు
నింటనువెలిగింపజేయునింతియెరామా!
*కం*
బాలికమమతలపెన్నిధి
చాలగగీమునచరించసంతసమొందన్
మేలగుపనులునుజరుగును
బాలికలేకున్నజగతినభవితనెతొలుగున్
*తే.గీ*
ఆడపిల్లలునింటిలో-నాడుచుండ
ముద్దు మురిపాలుకలుగును-ముదముతోడ
కాళ్ళగజ్జెలనాదము-గళ్ళుమనగ
సిరులమూటలేచేకూరు-విరివిగాను

కామెంట్‌లు