1.
అమ్మ ప్రేమను వెలకట్టలేము
బిడ్డను కనురెప్పలే చూడును.
కష్టాలు తెలియకుండా పించెను
అమ్మ ప్రేమ అమృత మయము
2.
తీయనైన పాటలతో
కమ్మనైన కథలతో
మనల్ని తీర్చిదిద్దిన జగద్జనని
అమ్మ ప్రేమ అమృతమయము
3.
జగతికి అవసరం అమ్మ
బిడ్డకు కంచెల కాపాడెను అమ్మ
ఎలా తీర్చును నీ రుణం అమ్మ
అమ్మప్రేమ అమృతమయము
4.
సృష్టి లో అద్భుత కల్పన అమ్మ
అమ్మ అనురాగం ముద్దుల మూట
శతకోటి వందనాలు నీకమ్మ
అమ్మ ప్రేమ అమృతమయము
5.
అమ్మ దుఃఖం అమావాస్య చీకటి
అమ్మ నీ దీవెన కలకాలం ఉండును
అమ్మా నువ్వు లేని లోకం శూన్యం
అమ్మ ప్రేమ అమృతమయము
6.
ఏమిస్తే తీరును అమ్మ నీ రుణం
ఉంటుందా అమ్మకు తూచ గల ధనం
అమ్మను మించి దైవమున్నదా
అమ్మ ప్రేమ అమృతమయము
7.
సృష్టికర్త బ్రహ్మ అయిన తలవంచను
అమ్మా నీ ప్రేమ ముందు
అందుకే ప్రేమకు ప్రతిరూపం అమ్మ
అమ్మ ప్రేమ అమృతమయము
8.
మంచితనానికి మారుపేరు అమ్మ
అమ్మఒడి కెళ్తే పోయాను గుండె అలజడి
అలాంటి అమ్మను వదలకు
అమ్మ ప్రేమ అమృతమయము
9.
నవమాసాలు మనల్ని మోసెను అమ్మ
కంటికి రెప్పలా కాపాడే అమ్మ
ఇలాంటి కోట్లాది తల్లులకు పాదాభివందనాలు
అమ్మ ప్రేమ అమృతమయము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి