110.నవ్వులుకొమ్మని,
పూయని పుష్పాలు!
కన్నులు కార్చే,
ఆనంద బాష్పాలు!
మటుమాయం శిశిరాలు!
సదా ఊర్ధ్వం మన శీర్షాలు!
111.
నవ్వే ముఖంతో,
మనముండాలి!
నవ్వే ముఖాల్ని,
చూస్తూ ఉండాలి!
ముఖాన చిరునవ్వే,
జీవకళ!
సాటి వారిని నవ్విస్తే,
అది జీవించేకళ!
112. పసిపాప నవ్వు!
పరమాత్మ మనకివ్వాలి!
పంకిల మంటకుండా!
మనస్సుల్ని ఉంచాలి!
*ఫలశ్రుతి*
----------------
113.నవ్వు పారిజాతం!
నవ్వు నవనీతం!
నవ్వు పునీతం!
నువ్వు మిగలవు!
నీకు మేమిచ్చేవి నువ్వులు!
మిగుల్చుకునేవి నీ నవ్వులే!
-
*నవ్వులు-కర్తవ్యం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి