దానం ధర్మం:- పెందోట వెంకటేశ్వర్లు
సంపాదించిన దేదైనా 
మనకే చెందును ఎప్పుడైనా
లేని వారలే వచ్చి అడిగిన
కొంతలోకొంత ఇవ్వచ్చుగా

 దానం ధర్మం చేయడము
 భూతదయలు ఉండడము 
మాన్యుల కే సాధ్యమగును
చరిత్రలో న కీర్తి కిరీటం

నిత్య దాతలు వృక్షాలు
తరచుగ దాతలు మేఘాలు
ఆ రెండు కలిగిన ప్రాణులు
తోటివారికే దాన మిడవలెను

కామెంట్‌లు