అరికాళ్ళల్లో ,పోటు -నివారణ.; పి . కమలాకర్ రావు
 రెండు, మూడు స్పూన్ల ఆవాలను నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చాలి. ఆ తరువాత రెండు కాళ్ళను ఆ నీళ్ళల్లో పెట్టి అలాగే కాసేపు కూర్చోవాలి. అరికాళ్ళల్లో మంట, పోటు తగ్గి పోతుంది.
2.తలనొప్పి తగ్గడానికి...
     అతిమధురం  పొడి, కొద్దిగా శోంటి, పొడి, తాటి కలకండ  నీళ్ళల్లో వేసి మరిగించి కాసేపు తరువాత గోరువెచ్చగా వున్నప్పుడు త్రాగితే తలనొప్పి తగ్గి పోతుంది.
3.గొంతు నొప్పి తగ్గడానికి....
   
కొన్ని లేతమామిడి ఆకులను  బాగా కడిగి ముక్కలుగా త్రుంచి  కొద్దిగా అల్లాన్ని దంచి , ఇవి నీళ్ళల్లో వేసి  బెల్లం కలిపి మరిగించి చల్లార్చి  త్రాగాలి.
గొంతునొప్పి తగ్గి పోతుంది.
4. మల ద్వారంలో మంట -నివారణ.
మెంతులను వేయించి పొడిగా చేసి అదే సమాన భాగంలో కరక్కాయ పొడిని కలిపి నీళ్లల్లో కలిపి ఉదయం  మరియు సాయంత్రం త్రాగుతుంటే, మలద్వారంలో మంట తగ్గి పోతుంది.


కామెంట్‌లు