*సీసమాలిక*
జాతీయజెండాను జగమునంతటికెల్ల
గర్వకారణమౌను గౌరవముగ
మూడురంగులుగల మువ్వన్నెలాజెండ
రెపరెపలాడును లీలగనుము
ధర్మము స్వచ్ఛత త్యాగముశాంతికి
గుర్తుగావాడిరి గొప్పగాను
గళ్ళిగళ్ళినెగుర కాంతినీజిమ్ముచు
ఐక్యతనేచాటు హాయిగాను
శ్లోకాలుగీతాలు సుందరముగపాడి
వందనంబులుజేతు రందరెపుడు
*తేటగీతి*
గొప్ప స్వాతంత్య్ర దినమున మెప్పుబొంద
మూడు రంగుల జెండాను ముచ్చటగనె
యెగురవేయుచుమ్రొక్కిరియేకబిగిన
దేశభక్తిని చాటగ తేజరిల్లు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి