వార్ధక్య మా !....:--- మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలు--జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా..

సీసమాలిక

ఊహ తెల్సిన నుండి యూపిరున్నవరకు
బ్రతుకుపోరునుజేయు వసుధ నందు,
నెవ్వరికైనను  నేగవలెను జన్మ
బాల్యమంతయు సాగు బాగుగాను,
పెళ్లితో బాధ్యత పెరుగును సంసార
సాగరమీదుట సాధ్యమౌన,
తనను తాను మరచి తనువంత యలసట
దీరకన్  పనులెన్నొ తీర్చిదిద్దు,
బిడ్డల బ్రతుకులు పెద్దగ జేయుట
ధ్యేయమనెంచియు దీపమౌను,
వయసు పెరిగి పోయి వార్ధక్య మందున
బిడ్డల చేష్టలు ప్రీతితోడ,
స్వాగతించవలెను చక్కగా నందరు
మనము పెంచినటుల మసలు చుండు,
మన యద్ధమే వారు మహనీయ మాన్యులు
స్వార్థ మొదిలి కొంత సాకవలెను .

తేటగీతి.

విలువలన్ని నేర్పుట మన విధియనెంచి,
చిన్నప్పటి నుండి పెద్దల సేవ జేయ,
నీవు నడిచిన విధమునే  నేర్వగలరు,
వార్ధక్యమునను వగచుట పాడి గాదు.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
సరళము గా బాగన్నది👌