కందపద్యాలు.
1.
అష్టమి రోజున కృష్ణుడు
అష్టమ గర్భమున బుట్టె యా దేవకికి ,
న్నిష్టముతో రేపల్లెకు ,
దుష్టుడు కంసుడిని జంప దూరెనురేయిన్!!!
2.
అందెలుమ్రోయగ కృష్ణుడు ,
చిందులు వేయుచును వేడ్క జేయుచునుండెన్
నందుని గృహమున ముద్దుగ ,
సందడి జేయంగ నందసతియే మురిసెన్!!!
3.
రారా ముద్దుల కృష్ణా ,
రారా నీలీలజూప రమ్యము తోడన్ ,
రారా యశోద తనయా ,
రారా మమ్ములను బ్రోవ రాజీవాక్షా!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి