బాహుబలి యతండు
శక్తియుక్తియందును
గుణసంపన్న హనుమండు
వారెవ్వా!అసమాన యోధుడు
అంజనీదేవి పుత్రుండు
శ్రీరామబంటు తానై
చిరకీర్తిని గాంచెను
సీతమ్మ జాడ తెలిపి
రాముని మదిలో నిలిచెను
ఆహా!హనుమంతుడు
దివ్య శక్తి మంతుడు
సంజీవిని గొనితెచ్చి
లక్ష్మణు ప్రాణం నిలిపె
రాముడికి ముదమిచ్చి,
చింత నతను బాపె
వారెవ్వా!వాయుపుత్రుడు
అతి పరాక్రమవంతుడు
కడలిని లంఘించి
లంకానగరం జేరెను
లంకిణి హతమొందించి
కాల్చెను ఆలంకను.
భళిరే!కేసరి నందనుడా
సురవరాల ధనుడా
అశోకవనమున సీతకు
అంగులీయక మిచ్చెను
తెలిపెను భూజాతకు
శ్రీరాముని క్షేమమును.
వారెవ్వా! హనుమంతుడు
రామ సేవాతత్పరుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి