వ్యాయామం (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

పిల్లలు పెద్దలు వినరండి
మనిషికి నడక  లేకుంటే
కండరాలు పట్టి వేసి
ఒంటిలో నొప్పులొచ్చి చేరును

వ్యాయామం లేకుంటే
వచ్చి చేరు వాత రోగాలు
కాయం కదలిక లేని నాడు
కష్టమవును మనిషి బ్రతుకు

మెదడుకు పెట్టండి మేత
చేతులకు చెప్పండి పని
కాళ్ళకు చూపండి నడక
శ్రమ శక్తిని నమ్మండి
 
సోమరితనం వదులుకుని
అడుగు ముందుకేయండి
మంచి చెడులు చూడండి
మంచి మనిషిగా బ్రతకండి

కామెంట్‌లు