బాలగేయం:-సత్యవాణి

 పదరా పోదాం బళ్ళోకి
చకచక నడచి పక పక నగుచూ
పదరా పోదాం బళ్ళోకి
భుజం కలుపుకొని
బుధ్ధిగ మనము
పదరా పోదాం బళ్ళోకి
మన బడిలోకి
గురువులు చెప్పే పాఠం విందాం
గబగబ పాఠాలప్పచెప్పుదాం
పదరా పోదాం బడిలోకి
ఆటస్థలములొ ఆటలాడుదాం
అందరు కలసి పాట పాడుదాం
పదరా పోదాం బళ్ళోకి
చకచక నడచీ పకపక నగుచూ పదరా పోదాం బళ్ళోకి
భుజం కలపుకొని బధ్ధిగ మనము
పదరా పోదాం బడిలోకి
మన బడిలోకి
        
                 
కామెంట్‌లు