ఊహల ఉయ్యాల ..!! >చిత్ర కవిత *:-డా.కె.ఎల్.వి.ప్రసాద్ > హన్మకొండ .

 పువ్వులంటే ఇష్టంలేని 
పడతి ఉంటుందా ...?
సుగంధాన్ని ఆస్వాదించలేని 
పురుషుడుంటాడా ....?
పువ్వు అందించిన 
పురుషుడి స్నేహగంధం 
కుసుమ సుగంధంతో కలిసి 
వెదజల్లుతున్న ప్రేమ గంధం
ఆమె ను తన్మయత్వంలో 
తన్నుతాను మరిచేలా చేసింది !
ఊహల ఉయ్యాలలో ...అమె 
సర్వం మరచి....
స్వర్గ లోకంలో విహరిస్తొంది !!

కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal. నిజామాబాద్ చెప్పారు…
సృష్టి లో అందం అందరికీ
Klv దృష్టి ప్రత్యేకం
అందరికీ అది అసాధ్యం
చూసే కళ్లు అందరికీ
అందం కనిపించే ది
మరి ఎందరికి