బొట్టె-సాహితీసింధు సరళగున్నాల
తే.గీ*ఆస్తికోసమై తలిదండ్రినావలకును
పంపిమురియగ నుండనిప్రాణసముడు
ప్రేమపంచుతు మనసార ప్రీతినొసగు
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర 

తే.గీ*ఆకలన్నను తృప్తిగా యన్నమిడుచు
మనసుదెలుసుక నడిచిన మంచివాడు 
మాట ఇచ్చినతప్పని నీటుగాడు
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర

తే.గీ*అవసరమ్ముకు తోడుండి నాదుకొనుచు
చిన్నిబాధైన చెంతకు చేరదీసి
ఆశృధారలు నినుజేరనడ్డుకొనెడి
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర


కామెంట్‌లు