కొంగనెగురనీయి కోరినట్లు(పద్యం):--- గుడిపూడి రాధికారాణి, గణిత ఉపాధ్యాయిని, మచిలీపట్నం.
సీ//
నింగిన కొంగలు నేలపై వాలెనే
      మల్లెపూలను బోలి తెల్లగాను
చేలనే దాటుచూ చెరువుపై నెగురంగ
      తారలై మెరిసెనే తీరుగాను
పుడమిపై వాలుచూ పురుగులనేరంగ
       చేరి జూడగ కడు చోద్యమయ్యె
వడిసెల పట్టంగ ఒడుపుగా కొట్టంగ
     చెల్లాచెదురయెను తల్లడిల్లి

ఆ//వె//
కొంగలెగిరి జేరె కొల్లేటి సరసును
గుంపు గూడినంత గుండె నిండె
చేరి మట్టుబెట్ట చేతులెట్లొచ్చెరా
కొంగనెగురనీయి కోరినట్లు



కామెంట్‌లు