గుర్రాల ముత్యాల హారాలు.: -గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి.-నాగర్ కర్నూలు జిల్లా.
 601) అలక మానవా సతి
         నీవు ఇయ్యవా ఆనతి
         వినిపించుకో నా వినతి
          అప్పుడే ఇక  ప్రశాంతి !
602) గుర్రపు డెక్కల ఆకు
        చెప్పకురా నువు సాకు
        ఆకుల్లో ఉంది బాకు
          తెచ్చి ఇవ్వరా మాకు !
603) కవరులో మూట గట్టు
         నాకోసారి చూపెట్టు
          గుట్టును చేయకు రట్టు
          కొట్టులో దాచి పెట్టు !
604) పనిపై దృష్టి పెట్టు
          లేకుంటే తగులు తట్టు
           ఇది కాదు కనికట్టు
            ఉండకు తెలియనట్టు !
605) చదువు నీవు భాగవతం
          అవుతుందిలే అవగతం
          వచ్చిందిగా అమృతం
           నీవు చెప్పు స్వాగతం !
606) వచ్చాడుగా హనుమ
         తీశాడుగా గనుమ
          వెంటనే వెళ్లి కనుమ
          అతని మాటను వినుమ !
607) ఈ లోకం తీరు చూడు
          చెప్పొచ్చాడులే వాడు
          నీ వెళ్ళు వానికి తోడు
           సదా నీతో ఉంటాడు !
608) వచ్చాడుగా బూచాడు
          వాడొచ్బి బెదిరించాడు
          పసివాడు అదిరాడు
          తిరిగి వాడు వెళ్ళాడు !
609) కమలం విచ్చుకున్నది
          గులాబీ గుచ్చుకున్నది
           రక్తం కారుతున్నది
           గాయమై రేగుతున్న ది !
610) అదిగో సూర్యోదయం
         ఇది సరైన సమయం
         ఒరేయ్ అయోమయం
          వెళ్లి రా ఈ ఉదయం !
611) డబ్బుంటే ఫికరుండదా
          ఎందుకు ఇవ్వాలి చందా
           అడుగు రా గోవిందా
            పక్క ఆంటీ ఇచ్చిందా !
612) డబ్బంటే ఎవరికి చేదు
         విప్పెనుగా ఆ సాదు
         పెట్టానుగా ఇక ఊదు
          చేసెనుగా ఓ జాదు !
613) మిరియాలు భలే ఘాటు
          వేస్తున్నా రులే  పోటు
           ఇక్కడి నుండి దాటు
           అక్కడ పెట్టు ఆ సూటు !
614) రాటుదేలిన మగవాడు
          మన తెలంగాణ వాడు
          ఇల పేరు మోసినవాడు
           మొనగాడై మెరిసాడు  !
615) గండికోట పోదామా
          దాని కథ విందామా
           ఊ అని  అందామా
            రావోయి చందమామా !
616) అతి ఏది పనికిరాదు
          అతిరసలు ఉండవు చేదు
           తెలుసుకొని రారాదు
           పో ఇక వికారాబాదు!
617) నీ తప్పు  తెలుసుకో
        తెలుసుకొని మసలుకో
         కలవారిని కలుసుకో
           నీ స్నేహాన్ని పెంచుకో !
618) రాముడే రాజైనాడు
         దేవుడై నిలిచాడు
          మనలను తాను గెలిచాడు
           వరాలను అందించాడు !
619) నిదురపో సోదరా
        ఏమిటి నీ బాధ రా
        నిశిరాతిరి ఇది రా
         నిరాశతో పండకురా!
620) తినురా ఈ బత్తాయి
          త్వరగా అవి వస్తాయి
           కనువిందు చేస్తాయి
           చేయి విందు నీవోయి !
621) పీటకు అతుక్కొని పోకు
         చేసుకో నీవు సోకు
          తినవద్దురా పొగాకు
           తింటే పోతవు బొందకు !
522) టీ టేబుల్ పై పెట్టు
          నీవు దాన్ని వడగట్టు
          చేయి అది అందేటట్టు
           నేతాగుతాగా ఒట్టు !
523) రాగి జావ నీవు త్రాగు
         కంచులా స్వరం మ్రోగు
          గానం నదిలా సాగు
          కంఠంలో అది తాగు !
524) వద్దంటే పెళ్లి మళ్ళి
         చేస్తున్నరు తుళ్ళి
          ఆడ అంతా లొల్లి
          ఏంది ఇది ఓ లల్లి !
525) కోతికొమ్మచ్చి ఆడు
         కొత్త పాట ఓటిపాడు
          గిజిగాడూ వస్తాడు
           మజానూ చేస్తాడు !
526) రిబ్బన్ కటింగ్ చేయి
         గోడకు అంటించేయి
          మెచ్చింది రమాబాయి
           ఇక అంతా హాయి హాయి !
527) సున్నం రంగు తెలుపుర
         అందరికీ తెలుపుర
           కర్ర వేసి కలుపుర
          వేసినంక దులుపుర !
528) నీ ఫోటో తీసుకుంటా
          గుండెల్లో దాచుకుంటా
          ఒప్పుకో నీ వంటా
           నీవు చెప్పేది వింటా !
529) కడుపులో ఆకలి మంట
          దానితోనే ఇక తంట
          ఏదో ఒకటి తింట
           అదే దానికి మందంట !
530) రావయ్య మా బావయ్య
          నీ మొలత్రాడు ఏదయ్య
           ఇంద తీసుకో వయ్య
           ఇక  కట్టుకోవయ్య !
531) ముక్కుపుడక బావుంది 
         ముఖము కూడా బాగుంది
         అందం కట్టేసుకుంది
          బంధం ముడి వేసుకుంది !
532) పెరిగింది రా గడ్డం
          ముఖానికి అది అడ్డం
            కాదు అది ఎడ్డం తెడ్డం
              పెంచేసి మనం చెడ్డం !   
533) కన్నంలో ఎలుక ఉంది
          చూచూచూ అంటుంది
          ఆ శబ్దం వినిపిస్తుంది
           అది పోదనిపిస్తుంది !
534) వనవిహారం చేద్దాం
         చుట్టి ఓసారొద్దాం
          పచ్చదనం పరిచేద్దాం
            అందరం ఆనందిద్దాం !
535) కలసి మెలసి ఉందమా
         సుఖం పంచుకుందమా    
         పరిమితమై ఉందమా  
          ఓ మా గొల్లభామా !
536) నీవు ఇల్లు కట్టి చూడు
         పెళ్లినీ  చేసి చూడు
          ఏమిటి రా ఈ గోడు
          ఎవడురా చెడుపుతాడు !
537) సినిమా హీరో వాడు
         నూనుగు మీసాలోడు
          చిత్రాల్లో నటిస్తాడు
          పాత్రల్లో జీవిస్తాడు !
538) సినిమాలు రకరకాలు
         పౌరాణిక సినిమాలు
         సాంఘిక సినిమాలు
          చారిత్రక సినిమాలు !
539) పూలు పండ్లు పెట్టు
         దోసిట్లో వానిని పట్టు
         ఒళ్ళో నీవికపెట్టు
          చీర రవిక పెట్టు !
540) తలలో పూలు పెట్టు
         జడ చుట్టూ రిబ్బన్ చుట్టు
          నుదుటన బొట్టు పెట్టు
          చక్కగా చీరను కట్టు !



కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం