:మనసు ముసుగు తెరవేస్తే--జె.నిర్మల-సిద్దిపేట
ఆ .వె

మనసుజెప్పినట్లు మాయలో బడకుండ
జీవితాలు నీవు చెరపకుండ
అంతరాత్మ తోడ యాలోచనలు జేసి
మంచి నెంచి జూడు మార్గ మిచ్చు

పెద్ద వారి మాట పెడదారి బట్టించి
మనసు ముసుగులోన మాయదారి
పనులు జేసుకుంటు పాడుబుద్ధి నటిస్తె
పతనమైత వెపుడు పరగ జూడు

కపటబుద్ధి మాని  కరుణహృదయుడిగ
జగతి యందు నీవు శక్తి బెంచి
మంచి పనులు జేసి మాన్యుడై పేరొంది
పుణ్యమూర్తి వైయ్యి పుడమి వెలుగు


కామెంట్‌లు