నటుడు Ms నారాయణ మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా అన్నయ్య తను చదువుకొనే రోజుల్లో రూమ్మేట్స్. తరువాత మాకు దగ్గరైపోయాడు. మా అన్నయ్య ఆర్మీ లోకి వెళితే. Ms లెక్చరర్ అయ్యాడు. సినిమా స్టోరీ రైటర్ గా నిరూపించుకొని తరువాత డైరెక్టర్ అవాలనేది ms కోరిక. భీమవరం నుండి కధలు పట్టుకొని విజయవాడ లో మా ఇంటికొచ్చి అక్కడ నుండి మద్రాస్ గానీ హైదరాబాద్ గానీ వెళ్ళేవాడు. మా అన్నయ్య ఆర్మీ లో ఉత్తరభారతం లో ఉండడంతో తను రాసుకొచ్చిన కధలు రాత్రి పడుకునే ముందు నాకు చెప్పేవాడు. తరువాత 1990 లో నేను హైదరాబాద్ రావడంతో ms ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అంబర్ పేట్ లో నా రూమ్ కి వచ్చేవాడు. అప్పట్లో నాకు tvs 50 ఉండేది. దానిపై ఇద్దరమూ తిరిగే వాళ్ళం. అంబర్ పేట్ నుండి కృష్ణనగర్, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ తిరిగే వాళ్ళం tvs50 డౌన్లో చాలా స్పీడ్ గా నడిపే వాడిని. వెనుక కూర్చొని తెగ భయపడేవాడు. ఒరే రమణా ఓ 75 పైసలు ఉంటే ఇవ్వు బస్సులో పోతా అనేవాడు జోక్ గా. కానీ
కృష్ణా ఒబ్రెయ్ దగ్గర అప్ ఎక్కేది కాదు.
పాపం Ms దిగి tvs 50 ని పై వరకూ తోసేవాడు.
' ఒక లెక్చరర్ ని కాబోయే డైరెక్టర్ తో బండి తోయిస్తావా పాపం రా ' అనేవాడు.
Ms తో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందులో ఇదొకటి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి