కర్మభూమి(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 నాగరికతను ప్రపంచానికి
నేర్పిన కర్మభూమి
జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని దర్శనం
చేయించిన పుణ్యభూమి
నదీమతల్లుల‌ అమృతధారలను
ఆలింగనం చేసుకొన్న వేదభూమి
సంస్కృతి సంప్రదాయాలను
తనలో ఇముడ్చుకొని వెలిగిన
అమృతభూమి
కర్మశీలుర,క్రాంతి కదనుల
చిరునామా అయిన పవిత్రభూమి
కుటుంబ వ్యవస్థ,వివాహాల విలువల దర్శనభూమి
నిలువెత్తు కీర్తిపతాకై నిలిచిన
భారతభూమే నా జన్మభూమి
ఆ భూమిని పూజించుదును
ప్రేమించుదును,అందులోనే మరణించుదును.
కామెంట్‌లు