నాన్న బాట నడుచుకో
అన్న చేయి పట్టుకో
అడుగులేస్తూ నడిచిపో
పలక బలపం పట్టుకుని
బడికి నీవు చేరుకో
గురువుగారి పాదాలకు
వందనాలు చేసుకో
గురువు చెప్పిన విద్యను
చక్కగా నీవు నేర్చుకుని
బుద్దిగా చదువుకొనుము
జ్ఞానము ఎంతో అబ్బును
విద్యా విధి రాత మార్చును
బ్రతుకు దారి చూపును
దొంగలకు దొరకకుండా
నిధులనేమొ ఎన్నో పెంచును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి