1.అంగీకార సూత్రం!
అభిప్రాయం వ్యక్తం!
ఆనందం ఆవిష్కారం!
బ్రతుక్కి ఆధారం!
2.పెదాలపై దరహాసం!
తరగని మధుమాసం!
వాడని సుమహారం!
వీడని ప్రాణస్నేహం!
3.శారీరక వ్యాయామం!
మానసిక వ్యవసాయం!
సామాజిక ఫలసాయం!
సర్వ జన"తృప్తి" దాయకం!
4.అణచలేని ఆనందం,
బహిర్ముఖం!
ఆపుకోలేని సంతోషం,
సర్వతోముఖం!
చెప్పు కోలేని మాట,
వెలువడే మార్గం!
ఒప్పయిన అనుభూతుల,
నిజ ఆశ్రయం!
5. ముఖాన విరిసిన మల్లి!
ఇంటి ముందు రంగవల్లి!
జీవితాన నిత్య జాబిల్లి!
లోకాన ఆనంద పాలవెల్లి!
( కొనసాగింపు)
*నవ్వు!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి