*ముత్యాహారాలు*:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్

 261.
భావిభారత దేశము
సమున్నతమైన శిఖరము
చేబూనాలందరము
కర్తవ్య బోధనము
262.
కొమ్మన కోయిల రాగము
అన్నలో అనురాగము
సోదరికదే ధైర్యము
జన్మజన్మల బంధము
263.
సోదరి కంట నీరు 
అన్నలు ఒలకనీయరు
మనసు తెలుసుకున్నవారు
ఆత్మ బంధువులు వారు
264.
చిరునవ్వుల బంధము
విరబూసిన సుగంధము
తెలియదు కల్లాకపటము
సోదరుల అనుబంధము
265.
కొలనులోని తామరలు
మకరందమున్న పూవులు
విలువైనది ఈ బంధము
అన్నా చెల్లెలి బoధము
266.
అమ్మానాన్నల సమము
సమాజ సంరక్షణము
అత్తవారింట ధైర్యము
అన్న గారి వైశిష్ట్యము
267.
ఇది ప్రజాస్వామ్య దేశము
అవినీతి అంతము
చేయాలి అందరము
ప్రగతి కొరకే వినుము
268.
మద్యం మత్తూ చిత్తులు
ఏమిటిది..?యువకులు
అర్ధరాత్రి వేషాలు
బాధ్యత లేని బండలు
269.
మహనీయుల ఆదర్శము
కలలు గన్న స్వరాజ్యము
ఎవరి కొరకు త్యాగము
వీడండిరా స్వార్థము
270.
నీది నాదను లేదు
తారతమ్యము వలదు
స్నేహములో చేవ కలదు
ప్రేమలో ప్రగతి కలదు


కామెంట్‌లు