కన్నీరు పెట్టించే పెద్ధింటి కథలు : --నలిమెల భాస్కర్

  పెద్దింటి అశోకుడు శ్రధ్ధగా తెలుగు సాహిత్య ఆవరణంలో కథల చెట్లు నాటాడు.గత ఇరవై ఏళ్లుగా ఆ తరువుల నీడే పాఠక బాటసారులకు సేద తీరే గొప్ప ఆదరువయ్యింది.అన్నట్లు.. ఈ అశోకుడే నవలల చెరువులూ తవ్వాడు.అవి చదువరులకు బాగా చేరువైనాయి.ఇప్పుడు ఏకంగా ఎనిమిదో కథల  పుస్తకాన్ని మన ఎద లోతుల్లోనే పాతాడు.పేరు... గుండెలో వాన.కథ అంటే వాస్తవికత.కొంతమంది  ఆశావహంగా ముగించాలనో,సందేశాత్మకంగా నిలవాలనో,ఆదర్శాలు చెప్పాలనో కథను కృతకంగా ముగిస్తారు.అశోక్ రాసిన నింద కథ ముగింపు చాలా సహజంగా,వాస్తవాలకు దగ్గరగా వుండడం నమూనా కథకు భిన్నం.గుండలో వాన..తెలంగాణ జీవద్భాషతో మనల్ని పిండేస్తుంది.కనబడని శత్రువు ఏ చేనునో గాలంగా మనల్ని చేపల్ని చేసి పట్టడం,పోరాటపటిమ
ప్రదర్శించే పోచయ్య మడమ తిప్పక నిలవడం లాంటివి ఎన్నెన్నో కతలు.అశోక్ శోకం బెట్టుకొని తన అశ్రువులతో తడిపాడు ఈ అక్షరాలను.నిజం..ఎత తెలిస్తేనే కత తెలుస్తది.ఇవి పన్నీటి కథలు కావు..అచ్చమైన కన్నీటి కతలు
కామెంట్‌లు