ఒక రాజుగారి, సచివాలయంలో , సుబ్బావధాని , అనే ఉద్యోగి, ఉండేవాడు .
అతన్ని, అందరు లంచావదాని, అని
పిలిచేవారు. లంచం ఇవ్వనిదే, ఏ పని
చేసేవాడుకాదు. రాజుగారికి ఎన్నో ఫిర్యాదులు
వెళ్లాయి. రాజుగారు, అతన్ని, అన్ని శాఖలకు, మార్చారు . అయినా, అవధాని
లంచం తీసుకోవటం , మానలేదు. రాజుగారికి , విసుగు, ఆగ్రహం వచ్చి ,
అతన్ని, ఉద్యోగంలోంచి, తీసేసారు .
ఒక వారం గడిచింది .
ఒకరోజు, ఉదయాన్నే , అవధాని , సచివాలయం ముందు, ఒక చెట్టు క్రింద,
ఒక బల్లేసుకుని కూర్చున్నాడు. బల్లమీద
ఒక బెండకాయ తోడిమా, ఇంకు పాడ్,
లాటిది వున్నాయి.
రాజుగారి , సచివాలయం లోకి, అర్జీ
పట్టుకుని, వెళుతున్నవాళ్లను , పిలిచి ,
బెండకాయ ముద్ర వేయించుకోవాలని ,
చెప్పి, బెండకాయ ముద్ర వేసి, డబ్బులు
తీసుకుంటున్నాడు . రాజుగారు కొత్తగా
చట్టం చేశారనుకొని , అందరు , అర్జీలమీద
ముద్ర వేయించుకొని , డబ్బులిస్తున్నారు.
చివరకు , ఎలా అయ్యిందంటే, అర్జిమీద
బెండకాయ ముద్ర లేకపోతే , అర్జీ, తీసుకోక , బెండకాయ ముద్ర వేయించుకొని రమ్మని తిప్పి పంపుతున్నారు.
ఒక రోజు, అవధానికి , సుస్తీ చేసింది .
డ్యూటీ ఎక్కాల . బెండకాయ ముద్ర
లేకపోవటంతో , సచివాలయం లోకిఅర్జీలు
వెళ్లడంలేదు. "ఏమిటి, ఈ రోజు ఒక్క అర్జీ కుడా
రాలేదని ", రాజుగారు , అడిగితె, బెండకాయ ముద్ర లేదన్నారు . "బెండకాయ ముద్ర ఏమిటి , ఎవరు వెయ్యమన్నారు? ", అని రాజుగారు అడిగితె
ఎవరికి వాళ్ళు మాకు తెలియదంటే , మాకు తెలియదన్నారు . పైగా మీరే చట్టం
చేశారేమో అని అనుకొన్నాం అన్నారు.
రాజుగారు , విచారణ చేపట్టి , అసలు
వ్యక్తిని ప్రవేశ పెట్టమంటే , ఎదురుగా
అవధాని!
రాజుగారికి , బుర్ర తిరిగింది. కిరీటం తీసి ,
ఒక సారి, తల గోక్కుని, నీ లంచావతారం
మాన్పించటం, భరించటం నావల్ల కాదు ,
అందుకు, నీకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను, అన్నారు.
"రాజా , ఇప్పటికిప్పుడు, నన్ను దేశం వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలి , ఎలా
బతకాలి ?", అని అవధాని అడిగాడు .
దక్షిణా పథాన , రెండు తెలుగు రాష్ట్రాలు
వున్నాయి, అక్కడి ప్రభుత్వాలు నీకు అనువుగా ఉంటాయి. ప్రజలు కుడా నిన్ను భరించగల శక్తి గలవారు --
నిన్ను తప్పకభరిస్తారు ", అని చెప్పి, రాజుగారు
లేచి , టక్కున వెళ్లిపోయారు.
తరువాత విషయం వేరే చెప్పాలా !!
" బెండకాయ ముద్ర " >మనోహర్ పంత్>భీమారం (హన్మకొండ )*
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి