17)
అమ్మ ఆరామమున నిలిచి
హరుని పతిగకోర తలచి
పత్రాహారిగ ఉండగ తపముతడిసె
అపర్ణగా కీర్తిని వడిసె!
18)
వటపత్రశాయిగా విష్ణువు చరితము
విన్నాముగా భక్తి భరితము
మేడి వృక్ష కలయము
దత్త దేవ నిలయము!
(కలయము=అంతటా)
19)
ప్రతిఆరు ఏళ్ళకు ఒకసారి
సాగరాన దారువువచ్చును ప్రతిసారి
అట్టిదాని రూపము జెక్కగ
అదికాదా జగన్నాధుని రూపుజూడగ!
20)
నరసింహుని అవతారము జూడగ
సత్య దైవము నిజముగ
హిరణ్యకశిపుని జీల్చిన నఖములు
నరహరికి లేకుండజేసె సుఖములు!
(సశేషము)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి