*వనమహోత్సవం-విశ్వవికాసం*("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(నాలుగవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
మన శుభకార్యములలో తిన్నగ
తరుశాఖలు కులదేవతలు ఎన్నగ
వైదిక కర్మలకు ఉపయోగము
వనౌషధులతో జరుగుతుంది యోగము!
14)
అశ్వథ్థము అనేపేరున్న చెట్టట
స్వర్గము నుండే వచ్చెనట
సేవిస్తే నీవు నిత్యము
తప్పక వరాలిచ్చును సత్యము!
15)
విజయదశమి పండుగ రోజున
విధిగ ఉండును పూజన
దేవ వృక్షము శమీ
అతి పవిత్రము సుమీ!
16)
పావన హనుమన్నకు మోదము
పారిజాత తరు పాదము
నిత్యనివాసము సాయికి మొదటగా
పచ్చని నింబ తరువటగా!
(సశేషము)

కామెంట్‌లు