స్వాతంత్య్రం ;-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)

నా దేశ మంత్రం స్వాతంత్య్రం 
నా దేశ యంత్రాంగం గణతంత్రం
నా దేశ ఉపదేశం గీత ఉపనిషత్తులు
నా దేశ వాదోపవాదాలు వేదాలు !?

మాకు స్వాతంత్య్రం  వచ్చింది కాదు
మాకు విజ్ఞాన శాస్త్రం వచ్చింది అంతే !?

మాకు స్వాతంత్య్రం  వచ్చింది ఇది కాదు
మాకు యంత్రం విద్యుత్తు వచ్చింది !?

మాకు స్వాతంత్య్రం వచ్చింది కాదు
ఆధునిక వ్యవసాయం వచ్చింది!?

మాకు స్వాతంత్య్రం వచ్చింది కాదు
మాకు ఆధునిక వైద్యం ఆరోగ్యం వచ్చింది !?

మాకు స్వాతంత్య్రం వచ్చింది కాదు
మాకు శాస్త్ర సాంకేతిక విద్య వచ్చింది!?

మాకు స్వాతంత్య్రం వచ్చింది కాదు
మాకు ఆధునిక ఆనకట్టలు కాలువలు చెరువులు నీళ్లు వచ్చాయి !?

మాకు స్వాతంత్య్రం  వచ్చింది కాదు
కార్లు రైళ్లు విమానాలు రవాణా సౌకర్యాలు వచ్చాయి!?

నిజంగా మా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కాదు
నిజంగా మా దేశానికి శాస్త్ర సాంకేతిక శాస్త్రం మాత్రమే వచ్చింది !?

Pratapkoutilya lecturer in Bio-Chem
8309529273 palem.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
శుభ సాయంత్రం. స్వాతంత్ర్యమె దేశాన , యిన్ని అవకాశాలు కల్పించిందని భావిద్దాం.