సీసమాలికపద్యంస్వార్థమింతను లేక సాగును వెన్నంటిమచ్చలేని చెలిమి మణుల విధము,జీవిత కాలమున్ క్షేమము కోరుతున్భేద భావము లేక ప్రేమ పంచు,కష్టాల సమయాన కంటికిన్ వెలుగులైకరుణించి కాపాడు కరుణమూర్తి,దుర్గుణాలను మాన్పి దొడ్డ వారిగ జేసిపరుల ముందున నిల్పు పరమయోగి,వెలుగులు నింపుతున్ వేదనల్ దీర్చుతున్శిల్పిలా మలచెడి చెలిమి గొప్ప,నిత్యమై నిఖిలమై నిలిచెడి నేస్తమువెంట యుండిన చాలు వేరె వలదు,పేద ధనిక యని భేదాలు జూపనిప్రాణ మిత్రుడు లభియింప పావనమ్ము.తేటగీతియెంచుకోవలె మిత్రుని యేరికోరి,పంచుకున్నను బాధలు పారిపోవు,పెంచుధైర్యాన్ని మన లోన పెన్నిధిగను,మంచి మిత్రుడొక్కడుచాలు మహిని గెలువ.
జీవిత శిల్పి.... మిత్రుడు:---మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలు-జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి